duch company
-
మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?
దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు. పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్‌మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి. -
ఆల్కహాల్ లేకుండానే బీరు!
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బీరు లాంటి చల్లటి పానీయాలు తాగాలనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే ఉంటారు. అందులోని ఆల్కహాలుకు అలవాటు పడితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాంటివారి కోసమే ఒక్కశాతం కూడా ఆల్కహాల్ లేని బీరును నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ కంపెనీ హైనెకెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. హైనెకెన్ 0.0 పేరుతో ఈ బీరును ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆల్కహాలు అసలు లేని లేదా అతి తక్కువ ఉండే బీర్లను తయారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2010 నుంచి ఇలాంటి బీర్లను తయారు చేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఆ కంపెనీలన్నీ కేవలం తమ స్వదేశానికి మాత్రమే పరిమితం కాగా, డచ్ కంపెనీ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఈ ఆల్కహాలు లేని బీర్ల మార్కెట్ 2010 నుంచి ఇప్పటివరకు ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
‘మడత’ హోటల్!
హైదరాబాద్: మడత మంచాల మాదిరిగానే ఈ హోటల్‌ను కూడా మడతపెట్టి తీసుకెళ్లొచ్చు! ఊరికి దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన చోట విందులు, ఉత్సవాలు, సమావేశాలు ఉన్నాయనుకోండి. అక్కడ హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లు ఉండవు కదా. అందుకే అతిథులకు అప్పటికప్పుడే హోటల్ గదులను సిద్ధం చేసేందుకే ఈ ఏర్పాటన్నమాట. లగేజీని మడత పెట్టి తీసుకెళ్లినట్లు ఈ హోటల్‌ను కూడా జస్ట్ పది నిమిషాల్లోనే మడత పెట్టేయొచ్చు. ఎక్కడైనా పది నిమిషాల్లోనే గదిని సిద్ధం చేయొచ్చు. అందుకే దీనికి ‘ఫ్లెక్సోటెల్’ అని పేరు పెట్టారు. ఇందులో రెండు మంచాలు, కుర్చీలు, బల్లలతో పాటు.. బాత్రూమ్ కూడా ఉంటుంది. ఔట్‌డోర్స్‌లో సాధారణంగా గుడారాలు వేస్తుంటారు. అయితే, అక్కడా హోటల్ దొరికితే బాగుండని అనుకునేవారికి, చౌకగానే హోటల్ గదులను అందించాలన్న ఆలోచనతో దీనిని ఓ డచ్ కంపెనీ తయారు చేసింది. దీనికి తాళం వేసుకోవచ్చు కాబట్టి పూర్తి ప్రైవసీ, సౌకర్యంగా ఉంటుంది. సరేగానీ.. మడతపెట్టినా తీసుకెళ్లడం ఇబ్బంది కాదా? ఏం కాదు.. ఎందుకంటే ఒక్క లారీలోనే ఏకంగా 20 హోటల్ గదులను ఈజీగా తీసుకెళ్లొచ్చట!