
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల పర్వానికి బ్రేక్ పడటం లేదు. మెలానియాతో వివాహం అనంతరం ట్రంప్ తనతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నారని, తన కుమార్తె ఇవాంకాను మరిపించేలా ఉన్నానని ట్రంప్ అన్నట్టు ప్లేబాయ్ మాజీ మోడల్ స్టామీ డేనియల్ వెల్లడించగా తాజాగా మరో మోడల్ ఇదే స్టోరీ వినిపించారు. 47 ఏళ్ల మాజీ మోడల్ కరెన్ మెక్‌డగల్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధం ఉందని, తన కుమార్తె ఇవాంక అంత అందంగా, ఆకర్షణీయంగా తాను కనిపిస్తానని ఆయన చెప్పేవారని మెక్‌డగల్ వెల్లడించారు.
సెలబ్రిటీస్ అప్రెంటీస్ షూటింగ్ సందర్భంగా 2006లో ట్రంప్‌ను తాను ప్లేబాయ్ మేన్షన్‌లో కలిశానని, అనంతరం తామిద్దరం శారీరకంగా కలిశామని ఆమె వెల్లడించారు. ట్రంప్ కుమార్తె ఎంత అందంగా..ఆకర్షణీయంగా ఉంటుందో తెలిసిందే..ఆమె అంతటి అందం,ఆకర్షణ తనలో ఉన్నాయని ట్రంప్ అనేవారని మాజీ మోడల్ వెల్లడించారు. తనకు కొంత మొత్తం ట్రంప్ ఆఫర్ చేశారన్నారు. కాగా, మెక్‌డగల్ ఆరోపణలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ట్రంప్‌తో లైంగిక సంబంధాలపై స్టామీ డేనియల్ సహా పలువురు మహిళల ఆరోపణలను ట్రంప్ ఖండించారని పేర్కొంది. అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకే వీరంతా ఆయనపై లైంగిక ఆరోపణలను చేస్తున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment