
రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 24 వరకు మాస్కోలో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీకానున్నారు.
ఈ భేటీలో భారత్- రష్యా మధ్య సంబంధాలు విస్తరించే అంశాలపై వారు చర్చించనున్నట్టు సమాచారం. రెండో రోజు సదస్సులో నరేంద్ర మోదీ, పుతిన్, భారత సీఈఓలు సమావేశం కానున్నారు.