
మాస్కో : ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్‌తో గురువారం భేటీ అయ్యారు. రష్యాలో తూర్పు ప్రాంత ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్) సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. వ్లాదివొటోక్‌లో వరుస సమావేశాలు సాగుతున్నాయని, మలేషియా ప్రధానితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్, మలేషియా ప్రజలు పరస్పరం లబ్ధి పొందేలా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత్-రష్యా వార్షిక సదస్సు, ఈఈఎఫ్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా చేరుకున్న సంగతి తెలసిందే. వ్లాదివొస్టోక్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment