పులి చర్మంతో దొరికిన థాయ్‌లాండ్ పూజారి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని వివాదాస్పద పులుల గుడి నుంచి పులి చర్మంతో పారిపోతున్న పూజారిని అధికారులు పట్టుకున్నారు. పూజారుల నివాస స్థలాల్లో జరిపిన తనిఖీల్లోనూ బతికున్న సింహం, ఇతర వన్యప్రాణులనుతో పాటు 20 పాత్రల్లో భద్రపరిచిన పులుల అవయవాలు, కళేబరాలను గుర్తించారు. గుడి నుంచి చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి రిఫ్రిజిరేటర్‌లో బుధవారం అధికారులు 40 పులిపిల్లల కళేబరాలను కనుగొన్న సంగతి తెలిసిందే.