వాళ్ల ప్రపంచమే వేరు | Primitive Tribes That Avoided Modern Civilization | Sakshi
Sakshi News home page

వాళ్ల ప్రపంచమే వేరు

Published Thu, Aug 6 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

వాళ్ల ప్రపంచమే వేరు

వాళ్ల ప్రపంచమే వేరు

సాక్షి, స్కూల్‌ఎడిషన్:
ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడికి వరకు మానవ పరిణామక్రమంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహారపు అలవాట్లు, వస్త్రాధారణ, జీవనవిధానం.. ఇలా చాలా అంశాల్లో మార్పులు సంభవించాయి. వేటకు స్వస్తి పలికారు. వ్యవసాయం, వ్యాపారాలవైపు దృష్టి కేంద్రీకరించారు. నాగరికత అభివృద్ధి చెందింది. గ్రామీణ, పట్టణ, నగర జీవనవిధానానికి అలవాటుపడ్డారు. అయితే  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని ఆదిమ తెగల ప్రజలు ఆధునిక సమాజానికి దూరంగా, వెలివేసినట్లుగా జీవిస్తున్నారు. అలాంటి ఆదిమ తెగలు ప్రపంచవ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన తెగల గురించి తెలుసుకుందాం.
 
సెన్‌టినేలేసే, అండమాన్ దీవులు
దక్షిణ అండమాన్ దీవుల్లో ఉండే ఆదిమజాతి. వీరు సుమారు 60 వేల సంవత్సరాల నుంచి ఈ దీవిలోనే జీవిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సబంధం లేని ఈ జాతి ప్రజలు తమ ఆవాసాల్లోకి వేరే జాతి ప్రజల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేని ఆదిమతెగ జాతుల్లో ఈ తెగదే తొలిస్థానం.  వేట వీరి ప్రధాన వృత్తి. వేటాడటం, చేపలు పట్టడం ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జనాభా చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 మంది కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు.

టొటోబిగొఇసోడే-అయోరియో, పరాగ్వే
పరాగ్వే, బొలివియాల్లో నివసించే ఆదిమ తెగ ఇది. వీరి మొత్తం జనాభా 5,600 మంది. ఇందులో 3వేల మంది బొలివియాలో, 2,600 మంది పరాగ్వేలో జీవిస్తున్నారు. వేట వీరి ప్రధాన వృత్తి. అయోరియో జాతి ప్రజల్లో ఎక్కువ మంది ఆధునిక జీవనానికి అలవాటు పడ్డారు. కొంత మంది మాత్రమే తమ సంస్కృతి, సంప్రదాయలు, ఆచారవ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా అడవుల్లో నివసిస్తున్నారు.

అవ లేదా గుజా, బ్రెజిల్
బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల తూర్పు భాగంలో నివసించే ఆదిమ తెగ. అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ తెగకు చెందిన ప్రజలు కేవలం 350 మంది మాత్రమే బతికున్నారు. ఈ తెగలోని కొంత మంది ప్రజలు 1980లో అడవులు వదలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాలనీలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు బాహ్యప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇప్పటికీ తమ జీవనవిధానాన్నే కొనసాగిస్తున్నారు. వీరు సంచార జీవులు. తుపి-గౌరాని కుటుంబానికి చెందిన బాష మాట్లాడుతారు.

జారావా, అండమాన్ దీవులు
అండమాన్‌లో జీవించే అనేక ఆదిమతెగల్లో ఇదీ ఒకటి. వీరి జనాభా 300 నుంచి 450 మధ్యలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడరు. వీరి సంస్కృతి, సంప్రదాయాలు,ఆచారవ్యవహారాలు బయటి ప్రపంచానికి తెలియవు. జారావా అనే పదానికి 'భూమి పుత్రులు' అని అర్థం. సుమారు 7వేల సంవత్సరాల నుంచి వీరు ఇక్కడ జీవిస్తున్నారు.  వీరిలో కొంత మంది మాత్రమే 1997 నుంచి ఆధునిక ప్రపంచంతో సంబంధాలుపెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇథియోపియా, సుడాన్ దక్షిణభాగంలో నివసించే ఆదిమ తెగ. ఈ తెగలో సురి, ముర్సి, మీన్ ఉపతెగలున్నాయి. ఇథియోపియా ప్రభుత్వ లెక్కలప్రకారం వీరి జనాభా సుమారుగా 1.87 లక్షలు. వీరంతా నిలో-సహారన్ కుటుంబంలోని సుర్మిక్ బ్రాంచ్‌కు చెందిన భాషను మాట్లాడుతారు. జనావాసాలకు దూరంగా అడవుల్లోని పర్వతాల్లో వీరు జీవిస్తున్నారు. పశుపోషణ వీరి ప్రధాన వృత్తి. వీరికి ఏకే-47 తుపాకీని ఉపయోగించటం కూడా తెలుసు.

న్యూగినియా ఆదిమతెగలు
న్యూగినియా దేశం ఎక్కువగా అడవులు, పర్వతాల్లో ఉంటుంది. అందుకే ఈ దేశం 312 ఆదిమ తెగలకు ఆలవాలంగా ఉంది. అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేనివి 44. ఎగువ పర్వత ప్రాంతంలో ఉండే ఆదిమ తెగలు పందుల పెంపకం, స్వీట్‌పొటాటోను పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్వతాలకు దిగువ భాగాన జీవించే ప్రజల ప్రధాన వృత్తి వేట.

పిన్‌టుపి, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పశ్చిమభాగంలో ఉండే గిబ్సన్ ఎడారిలో నివసించే ఆదిమజాతి. వేటాడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటారు. ప్రపంచంలో అంతరించిపోయే దశలో ఉన్న ఆదిమతెగల్లో ఇది ఒకటి. పిన్‌టుపి భాషను మాట్లాడుతారు. వీరిలో కూడా ఎక్కువ మంది ఆధునిక జీవనానికి అలవాటుపడ్డారు. కొంత మంది మాత్రమే ఇప్పటికీ తమ భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పాటిస్తూ, తమ సంఖ్యను వృద్ధి చేసుకునేందుకు పోరాడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement