Avoided
-
విమర్శ లేదా తిరస్కరణను హ్యాండిల్ చేయలేకపోతున్నారా?
విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్‌లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి. బాల్యానుభవాల నుంచే.. ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు. బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. అసమర్థత భావాలే ప్రధాన లక్షణం.. అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి. తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్‌లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం. అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్‌తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు. గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్‌ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు. ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం. నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది · ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?) -
సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన
చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ నేతలకు తెలిపారు. బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు. 'సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజలను దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ ఈ విశయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలి.' అని స్టాలిన్ తమ పార్టీ వర్కర్లకు తెలిపారు. మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు. ఇదీ చదవండి: Hindi Diwas: దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు? -
యువతితో మూడేళ్లపాటు ప్రేమ.. వివాహం అనగానే..
సాక్షి, సుల్తానాబాద్‌రూరల్(కరీంనగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఓ యువతి బైఠాయించిన సంఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన చొప్పరి సంజీవ్,అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పట్టించుకోకపోవడంతో అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఇద్దరి కులాలు ఒక్కటికావడంతోపాటు మైనర్లు కాగా గతంలో ఇరు కుటుంబాలకు తెలిసింది. 2018లో ఇరువురి కుటుంబాలు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కాగా స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో దండలు మార్చుకున్నారు. ప్రియుడి అన్నకు పెళ్లికాకపోవడంతో ప్రేమికులిద్దరు ఎవరి ఇంట్లో వారే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్ర స్తుతం ప్రియుడి అన్నకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తప్పించుకు తిరుగుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని కౌన్సెలింగ్ నిమిత్తం రాణాకు తరలించారు. -
దారుణం: పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ
సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): పంచాయితీకి పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల, గ్రామ బహిష్కరణ చేశారు పెద్దమనుషులు. ఈ తీర్పును సదరు కులానికి చెందిన ప్రజలు అమలు చేయాలని, వారితో ఎవరైనా మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని ఒప్పంద పత్రాలు రాశారు. ఈ ఘటన శాలిగౌరారం మండలం బైరవునిబండలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భైరవునిబండ గ్రామానికి చెందిన పులిగిల్ల అంజయ్య కుటుంబానికి అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబానికి మధ్య ప్రభుత్వ ఇంటి స్థల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ కులపెద్దమనుషుల వద్దకు చేరింది. ఈ నెల 26న కొంతమంది కులపెద్దలు పంచాయితీ మాట్లాడేందుకని ఇరు కుటుంబీకులకు కబురు పంపారు. దీనికి అంజయ్య కుటుంబీకులు వెళ్లలేదు. దీంతో కోపోద్రిక్తులైన కులపెద్దలు మా మాట వినకుండా కులధిక్కరణ చేశాడని అంజయ్య కుటుంబాన్ని కులంతోపాటు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కుటుంబీకులతో సదరు కులానికి చెందిన వ్యక్తులు మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10వేల జరిమానా విధిస్తూ హుకుం జారీ చేశారు. దీనిపై ఒప్పంద పత్రాలు రాసి ప్రచారం చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు (27న) అంజయ్య సొంత పనిపై సాయంత్రం వేళలో వీధిలోనుంచి వెళ్తుండగా గ్రామానికి చెందిన కులపెద్దలు గ్రామంలో కూడా తిరగవద్దని అతన్ని బెదిరించారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన అంజయ్య అదేరోజు రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కులపెద్దలు పులిగిల్ల పోశయ్య, పులిగిల్ల బిక్షమయ్య, నరిగె శంభయ్య, దుప్పెల్లి నరేశ్‌లపై ఫిర్యాదు చేశాడు. దీంతో కుల పెద్దమనుషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆ చెన్నై రోజులు తిరిగిరావు -
రేషనలైజేషన్ యోచనను విరమించుకోవాలి
విద్యారణ్యపురి : ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల రేషనలైజేషన్ యోచనను విరమించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం జరిగిన సం ఘంస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడుతూ 2014లో రేషనలైజేషన్ కోసం జీవో 6ను విడుదల చేశాక వ్యతి రేకత వ్యక్తం కావడంతో అప్పట్లో విరమించుకుం దన్నారు. అయితే, మళ్లీ రేషనలైజేషన్‌ను తెరపైకి తీసుకురావడం సరికాదని, వేసవి సెలవుల్లోనే బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. బడిబాట కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీతో కూడినఆంగ్లమాధ్యమంను అనుమతించాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.సదయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి పి.లక్ష్మినర్సయ్య, బా««దl్యులు అంబాప్రసాద్, బి.రవి, ఆర్.లక్ష్మణ్‌రావు, ఎన్.రమేష్, ఎన్.సాంబయ్య,బి.రమేష్, సుధాకరాచారి, ఏకాంబరాచారి, కె.సురేష్, ఎ.శ్రీధర్, డి. నాగరాజు, డి.శివకోటి, ఎన్.శ్రీహరి పాల్గొన్నారు. -
హేతుబద్ధీకరణ విరమించుకోవాలి
విద్యారణ్యపురి : ప్రభుత్వం ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలనే యోచనను విరమించుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఎస్.సదానంద్ డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఈ క్రమంలో రేషనలైజేషన్ చేస్తే ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో డైట్ కళాశాల, బీఈడీ కళాశాలలో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో, కార్యాలయాల్లో ఇంకా పనిచేస్తున్న టీచర్ల డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీహెచ్.రవీందర్‌రాజు, ఎ.విద్యాదేవి, కె.కళ, పెండెం రాజు, కుమారస్వామి, రమేష్, లింగారావు, సత్యనారాయణ, సృజన్ప్రసాద్ పాల్గొన్నారు. -
వాళ్ల ప్రపంచమే వేరు
సాక్షి, స్కూల్‌ఎడిషన్: ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడికి వరకు మానవ పరిణామక్రమంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహారపు అలవాట్లు, వస్త్రాధారణ, జీవనవిధానం.. ఇలా చాలా అంశాల్లో మార్పులు సంభవించాయి. వేటకు స్వస్తి పలికారు. వ్యవసాయం, వ్యాపారాలవైపు దృష్టి కేంద్రీకరించారు. నాగరికత అభివృద్ధి చెందింది. గ్రామీణ, పట్టణ, నగర జీవనవిధానానికి అలవాటుపడ్డారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని ఆదిమ తెగల ప్రజలు ఆధునిక సమాజానికి దూరంగా, వెలివేసినట్లుగా జీవిస్తున్నారు. అలాంటి ఆదిమ తెగలు ప్రపంచవ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన తెగల గురించి తెలుసుకుందాం. సెన్టినేలేసే, అండమాన్ దీవులు దక్షిణ అండమాన్ దీవుల్లో ఉండే ఆదిమజాతి. వీరు సుమారు 60 వేల సంవత్సరాల నుంచి ఈ దీవిలోనే జీవిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సబంధం లేని ఈ జాతి ప్రజలు తమ ఆవాసాల్లోకి వేరే జాతి ప్రజల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేని ఆదిమతెగ జాతుల్లో ఈ తెగదే తొలిస్థానం. వేట వీరి ప్రధాన వృత్తి. వేటాడటం, చేపలు పట్టడం ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జనాభా చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 మంది కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. టొటోబిగొఇసోడే-అయోరియో, పరాగ్వే పరాగ్వే, బొలివియాల్లో నివసించే ఆదిమ తెగ ఇది. వీరి మొత్తం జనాభా 5,600 మంది. ఇందులో 3వేల మంది బొలివియాలో, 2,600 మంది పరాగ్వేలో జీవిస్తున్నారు. వేట వీరి ప్రధాన వృత్తి. అయోరియో జాతి ప్రజల్లో ఎక్కువ మంది ఆధునిక జీవనానికి అలవాటు పడ్డారు. కొంత మంది మాత్రమే తమ సంస్కృతి, సంప్రదాయలు, ఆచారవ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా అడవుల్లో నివసిస్తున్నారు. అవ లేదా గుజా, బ్రెజిల్ బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల తూర్పు భాగంలో నివసించే ఆదిమ తెగ. అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ తెగకు చెందిన ప్రజలు కేవలం 350 మంది మాత్రమే బతికున్నారు. ఈ తెగలోని కొంత మంది ప్రజలు 1980లో అడవులు వదలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాలనీలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు బాహ్యప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇప్పటికీ తమ జీవనవిధానాన్నే కొనసాగిస్తున్నారు. వీరు సంచార జీవులు. తుపి-గౌరాని కుటుంబానికి చెందిన బాష మాట్లాడుతారు. జారావా, అండమాన్ దీవులు అండమాన్‌లో జీవించే అనేక ఆదిమతెగల్లో ఇదీ ఒకటి. వీరి జనాభా 300 నుంచి 450 మధ్యలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడరు. వీరి సంస్కృతి, సంప్రదాయాలు,ఆచారవ్యవహారాలు బయటి ప్రపంచానికి తెలియవు. జారావా అనే పదానికి 'భూమి పుత్రులు' అని అర్థం. సుమారు 7వేల సంవత్సరాల నుంచి వీరు ఇక్కడ జీవిస్తున్నారు. వీరిలో కొంత మంది మాత్రమే 1997 నుంచి ఆధునిక ప్రపంచంతో సంబంధాలుపెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇథియోపియా, సుడాన్ దక్షిణభాగంలో నివసించే ఆదిమ తెగ. ఈ తెగలో సురి, ముర్సి, మీన్ ఉపతెగలున్నాయి. ఇథియోపియా ప్రభుత్వ లెక్కలప్రకారం వీరి జనాభా సుమారుగా 1.87 లక్షలు. వీరంతా నిలో-సహారన్ కుటుంబంలోని సుర్మిక్ బ్రాంచ్‌కు చెందిన భాషను మాట్లాడుతారు. జనావాసాలకు దూరంగా అడవుల్లోని పర్వతాల్లో వీరు జీవిస్తున్నారు. పశుపోషణ వీరి ప్రధాన వృత్తి. వీరికి ఏకే-47 తుపాకీని ఉపయోగించటం కూడా తెలుసు. న్యూగినియా ఆదిమతెగలు న్యూగినియా దేశం ఎక్కువగా అడవులు, పర్వతాల్లో ఉంటుంది. అందుకే ఈ దేశం 312 ఆదిమ తెగలకు ఆలవాలంగా ఉంది. అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేనివి 44. ఎగువ పర్వత ప్రాంతంలో ఉండే ఆదిమ తెగలు పందుల పెంపకం, స్వీట్పొటాటోను పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్వతాలకు దిగువ భాగాన జీవించే ప్రజల ప్రధాన వృత్తి వేట. పిన్టుపి, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పశ్చిమభాగంలో ఉండే గిబ్సన్ ఎడారిలో నివసించే ఆదిమజాతి. వేటాడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటారు. ప్రపంచంలో అంతరించిపోయే దశలో ఉన్న ఆదిమతెగల్లో ఇది ఒకటి. పిన్టుపి భాషను మాట్లాడుతారు. వీరిలో కూడా ఎక్కువ మంది ఆధునిక జీవనానికి అలవాటుపడ్డారు. కొంత మంది మాత్రమే ఇప్పటికీ తమ భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పాటిస్తూ, తమ సంఖ్యను వృద్ధి చేసుకునేందుకు పోరాడుతున్నారు.