హేతుబద్ధీకరణ విరమించుకోవాలి
Published Mon, Jul 25 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
విద్యారణ్యపురి : ప్రభుత్వం ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలనే యోచనను విరమించుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఎస్.సదానంద్ డిమాండ్ చేశారు.
ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్‌లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఈ క్రమంలో రేషనలైజేషన్ చేస్తే ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో డైట్ కళాశాల, బీఈడీ కళాశాలలో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో, కార్యాలయాల్లో ఇంకా పనిచేస్తున్న టీచర్ల డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీహెచ్.రవీందర్‌రాజు, ఎ.విద్యాదేవి, కె.కళ, పెండెం రాజు, కుమారస్వామి, రమేష్, లింగారావు, సత్యనారాయణ, సృజన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement