ప్రతీకాత్మక చిత్రం
లండన్: ప్రిన్స్ ఆఫ్ వేల్స్, రాణి ఎలిజబెత్-2 తనయుడు, దివంగత ప్రిన్సెస్ డయానా భర్త చార్లెస్(70) నవంబర్‌లో రెండురోజులపాటు అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నారు. వాతావరణ మార్పులు, సుస్థిర మార్కెట్లు, సోషల్ ఫైనాన్స్ అంశాలను దృష్టిలో పెట్టుకుని చార్లెస్ భారత్‌కు రానున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. చార్లెస్ తన 10వ అధికారిక భారత పర్యటనలో భాగంగా నవంబర్ 13న న్యూఢిల్లీకి రానున్నారని సమాచారం. భారత్‌కు ఆయన చివరిసారిగా తన రెండో భార్య కెమిల్లాతో కలిసి రెండేళ్ల క్రితం 2017 నవంబర్ లో వచ్చారు. యూరోపియన్ యూనియన్ (బ్రెక్జిట్) నుంచి వైదొలిగిన నేపథ్యంలో బ్రిటన్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చార్లెస్ తనయుడు ప్రిన్స్ విలియం తన భార్యతో కలిసి గతవారం పాకిస్తాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment