కేలరీలు కరిగిస్తే.. మధుమేహాన్ని గెలవచ్చు! | Professor Roy Taylor about Diabetes | Sakshi
Sakshi News home page

కేలరీలు కరిగిస్తే.. మధుమేహాన్ని గెలవచ్చు!

Published Thu, Sep 14 2017 2:56 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

కేలరీలు కరిగిస్తే.. మధుమేహాన్ని గెలవచ్చు!

కేలరీలు కరిగిస్తే.. మధుమేహాన్ని గెలవచ్చు!

‘మధుమేహం వస్తే వదలదు.. జీవితాంతం భరించాల్సిందే’ ఇదీ మనం తరచూ వినే విషయం. అయితే టైప్‌–2 మధుమేహాన్ని పూర్తిగా వదిలించు కోవడం అసాధ్యమేమీ కాదని న్యూక్యాసిల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ రాయ్‌ టేలర్‌ అంటున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న రాయ్‌ చెబుతున్న దాని ప్రకారం.. టైప్‌ –2 మధుమేహాన్ని అరికట్టాలంటే శరీరానికి అందే కేలరీలు తగ్గాలి అంతే! ఈ మేరకు లిస్బన్‌లో జరిగే యూరోపియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌ సదస్సులో తన సుదీర్ఘ పరిశోధన వివరాలను డాక్టర్‌ రాయ్‌ వెల్లడించనున్నారు.

అధిక కేలరీల కారణంగా మన కాలేయంలో కొవ్వు ఎక్కువగా చేరడంతో మధుమేహం మొదలవుతుంది. అధిక కొవ్వు వల్ల కాలేయం ఇన్సులిన్‌కు పెద్దగా స్పందించదు. పైగా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కాలేయంలోని అధిక కొవ్వు.. క్లోమ గ్రంధిలోకి చేరి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా మధుమేహం వస్తుంది. అయితే ఈ పరిస్థితిని అధిగమిం చడం చాలా సులువని రాయ్‌ సూచిస్తున్నారు. కాలేయంలోని కొవ్వు ఒక గ్రాము కరిగినా పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు. అయితే వ్యాధి వచ్చిన తర్వాత పదేళ్ల లోపు మాత్రమే దాన్ని నియంత్రించేందుకు అవకాశముంటుంది. ఈ విషయాన్ని తాము రుజువు చేశామని.. చాలా మంది స్వచ్ఛందంగా కేలరీలను నియంత్రించడం ద్వారా రక్తంలోని చక్కెరను తగు మోతాదులో ఉంచుకోగలిగారని రాయ్‌ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement