
ఎలుకల మాంసం.. చికెన్ వింగ్స్‌గా..
వాషింగ్టన్: ఎలుకల మాంసాన్ని అమెరికాలో చికెన్ వింగ్స్ పేరిట రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గుర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కప్ప, ఎలుక, పాములను చైనీయులు లొట్టలేసుకుని తింటున్నట్లు.. అమెరికన్లు తినరనే ఉద్దేశ్యంతో అక్కడి కంపెనీలు ఎలుకల మాంసాన్ని ప్రాసెస్ చేసి చికెన్ వింగ్స్ పేరిట వండి వడ్డిస్తున్నట్లు వదంతులు వ్యాప్తి చెందాయి.
క్లారిటీ ఇచ్చిన ఎఫ్‌డీఏ
ర్యాట్ వింగ్స్ విక్రయాలు అవాస్తవమని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఎలుకల మాంసాన్ని చికెన్ వింగ్స్‌గా విక్రయిస్తున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయగా వైరల్ మారినట్లు అధికార ప్రతినిధి పీటర్ కాస్సెల్ తెలిపారు. భోజన ప్రియులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని, తాము అలాంటి రెస్టారెంట్లను అసలు గుర్తించలేదని చెప్పారు. ఇప్పటివరకూ 3 లక్షల పౌండ్ల చికెన్ మాంసాన్ని గుర్తించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఎఫ్‌డీఏ ఎలాంటి రెస్టారెంట్లకు గానీ, సంస్థకు గానీ నోటీసులు జారీ చేయలేదని వివరించారు.