జై భీమ్ కోసం ఎలుకను తిన్నాను: హీరోయిన్
Jai Bhim Movie: Lijomol Jose Training in Catching Rats and Taste Rat Meatఫ లిజోమోల్ జోస్ అంటే గుర్తుపడతారో లేదో కానీ 'జై భీమ్' లో సినతల్లి అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. అంతలా పాత్రలో జీవించేసిందీ నటి. అంతకు ముందు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన లిజొమోల్కు తెలుగులో డబ్ అయిన ఒరేయ్ బామ్మర్ది సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఆమె నటనే చూసే దర్శకుడు జ్ఞానవేల్ 'జై భీమ్' సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ఆమె గిరిజన మహిళగా, గర్భవతిగా అందరితో కన్నీళ్లు పెట్టించే సినతల్లిగా పవర్ఫుల్ పాత్రలో నటించింది.
ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశానంటోంది లిజోమోల్. ప్రతిరోజూ గిరిజనుల గుడిసెలకు వెళ్లేదాన్నని, అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకుని వాళ్లతో కలిసి పని చేసేదాన్నని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని, పగలూరాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని, అవన్నీ తాను కూడా చేశానంటోంది. సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని, అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది.
'వాళ్లు ఎలుకలను వేటాడి వండుకుని తింటారు. ఏవి పడితే అవి కాకుండా పొలాల్లో దొరికేవే తింటారు, నేను వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నాను. అందుకే ఎలుక కూర తిన్నాను' అని చెప్పుకొచ్చింది. తనకైతే అది చికెన్లా అనిపించిందని పేర్కొంది. ఈ విషయం ఇంట్లో తెలిసి నువ్వు ఎలుక కూర తిన్నావా? అని అడిగారని అయితే ఆ కూర తినడం తప్పేం కాదని, వాళ్లు తింటున్నప్పుడు మనమెందుకు తినకూడదు అని సర్ది చెప్పానంది. అప్పటినుంచి ఎవరూ దాని గురించి మళ్లీ ప్రస్తావించలేదని తన అనుభవాలను చెప్పుకొచ్చింది లిజోమోల్.