రియల్ ‘డిస్నీ’ చూసొద్దాం..
అరె ఈ కోటను ఎక్కడో చూసినట్టుందే అనుకుంటున్నారా! గుర్తొచ్చిందా.. డిస్నీ వరల్డ్ సినిమాల్లోని యువరాణి రాపంజెల్ నివాసంలా ఉంది కదూ..! ఫ్రాన్స్‌లోని నోర్మండీ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపాన్ని చూసే అచ్చం ఆ మహల్ లాగే డిస్నీ సినిమాల్లో రూపొందించారు డిజైనర్లు. ఇదొక్కటే కాదు ‘ఫ్రోజెన్’లోని ఐస్ ప్యాలెస్‌ను కెనడాలోని డీ గ్లేస్ హోటల్, ‘న్యూగ్రూవ్’లోని పర్వతాలను పెరూలోని ‘మాచుపిచూ’ నుంచి స్ఫూర్తి పొందినవే. ఈ రియల్ లైఫ్ డిస్నీ వరల్డ్ మీ కోసమే ఎదురుచూస్తోంది. మరెందుకు ఆలస్యం..!