వయసు తగ్గించే పిల్ వస్తుందా? | reduce the age of metformin | Sakshi
Sakshi News home page

వయసు తగ్గించే పిల్ వస్తుందా?

Published Mon, Jul 13 2015 7:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

వయసు తగ్గించే పిల్ వస్తుందా?

వయసు తగ్గించే పిల్ వస్తుందా?

వాషింగ్టన్: మధుమేహ చికిత్సకు ఉపయోగించే ఔషధం వయసును తగ్గించేందుకు, ఎక్కవకాలం ఆరోగ్యంగా జీవించేందుకు కూడా తోడ్పడుతుందట. మెట్‌ఫార్మిన్..అనే మందును ఇప్పటికే మధుమేహ చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇది జంతవుల వయసును తగ్గించడంలో ఉపయోగిపడిందని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీరి అధ్యయనం ప్రకారం టైప్-2 మధుమేహ రోగులకు మెట్‌ఫార్మిన్‌ను అందించారు. ఇతర సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే వీరిలో 15శాతం ఆయుఃప్రమాణం మెరుగైనట్లు పరిశోధకులు గుర్తించారు.

మధుమేహం లేనివారికి కూడా ఈ మందు వయసును తగ్గిస్తుందా అనే అంశంపై 3000 మందిని వారు అధ్యయనం చేయనున్నారు. జంతువులపై ఇదివరకే ఈ ఔషధాన్ని ప్రయోగించారు. ఈ మందు జీవక్రియా రేటుని, వయసు పెరుగుదలకు కారణమయ్యే కణ విభజన ప్రక్రియల్ని తగ్గించిందని వారు కనుగొన్నారు. ఇప్పుడు ఈ ఔషధాన్ని మనుషులపై ప్రయోగించేందుకు అమెరికా యత్నిస్తోంది. ఇది విజయవంతమైతే మానవులు ఎప్పుడూ యవ్వనంగానే కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement