ప్రేయసితో కెన్నడీ(ఫైల్ ఫొటో)
మోంటానా : ఎన్నో పర్వతాలను అధిరోహించి తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సుప్రసిద్ధ పర్వతారోహకుడు హేడెన్ కెన్నడీ(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. పర్వతారోహణే తన జీవిత పరమావధిగా సాగిన హేడెన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఓ పర్వతమే.
హేడెన్‌కు ఓ ప్రేయసి ఉంది. ఆమె పేరు ఇంజ్ పెర్కిన్స్(23). ఇద్దరూ అథ్లెట్లే. స్కీయింగ్ కోసం అమెరికాలోని మోంటానాలోని ఓ పర్వతం వద్దకు పెర్కిన్స్‌తో కలసి వెళ్లాడు హేడెన్. ఇద్దరూ ఆహ్లాదకరంగా స్కీయింగ్ చేస్తుండగా.. పర్వతం మీద నుంచి మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పెర్కిన్స్ చరియల అడుగును కూరుకుపోయి ప్రాణాలు కోల్పోగా.. హేడెన్ చరియలు పడిన ప్రాంతానికి దూరంగా ఉండటంతో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
ప్రేయసి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చూసిన హేడెన్ తీవ్రంగా కలత చెందాడు. మర్నాడే మోంటానాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అమెరికాలోని మౌంటెనీర్లు షాక్‌కు గురయ్యారు. ఒకేసారి ఇద్దరు పర్వతారోహకులను కోల్పోవడం తమను తీవ్రంగా కలచి వేసినట్లు పేర్కొన్నారు. 'పెర్కిన్స్‌ను హేడెన్ తనలో సగంగా భావిస్తాడు. అందుకే ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కన్నీళ్లతో హేడెన్ తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాంస అని హేడెన్ తండ్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment