ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే | Robert De Niro Blasts "Pig" Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే

Published Sun, Oct 9 2016 10:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే - Sakshi

ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే నీరో ట్రంప్పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ట్రంప్ ఓ పంది, ఓ కుక్క, పనికిమాలిన ఎద్దు ఇంకా చాలా అంటూ ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు. అతడొక జాతీయ విపత్తులాంటివారంటూ ఆరోపించారు.

ట్రంప్ విషయమే తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోందని, అసలు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ ముక్కుమీద ఒక్కసారి గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా ట్రంప్ ఓ ట్యాక్సీ డ్రైవర్ లాంటి వాడంటూ విమర్శించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement