
ట్రంప్ ఓటమికి రూ.13 కోట్ల విరాళం
డెమొక్రాట్లకు ఇచ్చిన ఎఫ్‌బీ సహ వ్యవస్థాపకుడు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మస్కోవిట్జ్ ప్రకటించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు డెమోక్రటిక్ పార్టీకి రెండు కోట్ల డాలర్ల (రూ. 13.38 కోట్లు)ను విరాళంగా ఇచ్చారు. ‘ట్రంప్ గెలిస్తే దేశం వెనుకబడి పోతుంది.
అంతర్జాతీయ సమాజం నుంచి విడిపోయి ఒంటరయ్యే ప్రమాదముంది’ అని తన బ్లాగ్‌లో ‘కంపెల్డ్ టు యాక్ట్’ శీర్షికతో పోస్ట్ చేశారు. ఈ పోస్టు కింద ఆయన భార్య కూడా సంతకం చేశారు. ట్రంప్ విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని డస్టిన్ పేర్కొన్నారు.