బాంబు పేలుతోంది.. ఊరు ఖాళీ చేయండి!
బాంబు పేలుతోంది.. ఊరు ఖాళీ చేయండి!
Published Sun, Dec 25 2016 3:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
దక్షిణ జర్మనీలోని ఆగ్స్‌బర్గ్ ప్రాంతానికి చెందిన దాదాపు 54 వేల మంది క్రిస్మస్ పండగ కూడా చేసుకోడానికి లేకుండా పొద్దున్నే తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి 1.8 టన్నుల బరువున్న ఓ పెద్ద బాంబును నిర్వీర్యం చేయడానికి అధికారులు సిద్ధం కావడమే అందుకు కారణం. నగరంలో ఉన్న మధ్యయుగం ఆనటి కెథడ్రల్, సిటీ హాల్‌లను కూడా ఖాళీ చేయించేశారు. ఉదయం 8 గంటల నుంచే ఖాళీ చేయించడం మొదలుపెట్టి, 10 గంటల కల్లా మొత్తం ఊరిని నిర్మానుష్యం చేసేశారు.
బాంబును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని పోలీసులు అన్నారు. తమ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లలేనివారి కోసం దూర ప్రాంతాల్లో స్కూళ్లను తెరిచి ఉంచారు. తమతో పాటు పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లిపోవాలని సూచించారు. ఇందుకోసం ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా పైసా చార్జీ కూడా తీసుకోలేదు. జర్మనీలో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు బయటపడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో కోబ్లెంజ్ నగరంలో ఇలాగే ఒక బాంబు కనపడటంతో అప్పుడు 45 వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించారు.
Advertisement
Advertisement