భారత్‌లో పెరుగుతున్న మతపరమైన దాడుల వల్ల అల్‌కాయిదా పుంజుకునే వీలుందని అమెరికా నిపుణులు విశ్లేషించారు.
వాషింగ్టన్: భారత్‌లో పెరుగుతున్న మతపరమైన దాడుల వల్ల ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా పుంజుకునే వీలుందని అమెరికా నిపుణులు విశ్లేషించారు. భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌కాయిదా ప్రయత్నిస్తోందనీ, పెద్దఎత్తున యువ తను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోందని అమె రికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు సాగించే కేథరిన్ జిమ్మర్‌మన్ వెల్లడించారు.
ఆఫ్రికా ప్రాంతాలు మఘ్రెబ్, సహెల్‌లలో ఐసిస్ ప్రవేశించాక అల్‌కాయిదా అక్కడ బలపడిందనీ, భారత్‌లోనూ కార్యకలాపాలను విస్తృతం చేయొచ్చని కేథరిన్ అన్నారు.