నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అధ్యయనంలో తేలింది.
న్యూయార్క్: విపరీతమైన పని ఒత్తిడివల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఎమర్జెన్సీ, మెడికల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు నిద్రకు దూరమవుతుంటారు.
ఇలాంటి వారిలో గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమైనట్టు గుర్తించామని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బోన్ కి చెందిన డానియెల్ కేటింగ్ అన్నారు. పని ఒత్తిడి వల్ల కేవలం మూడు గంటలే నిద్రపోతున్న 20 మందిపై పరిశోధన చేసి ఈ విషయం గుర్తించారు. కొందరికి రక్తపోటు పెరిగి నట్టు గుర్తించామని కేటింగ్ చెప్పారు.