
రోబోలకూ ‘స్మార్ట్’ చర్మం!
బీజింగ్: తమ చుట్టూ ఉన్న వస్తువులను రోబోలు తాకి గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పారదర్శకమైన ‘స్మార్ట్’ చర్మాన్ని అభివృద్ధిపరిచారు. రోబోల కృత్రిమ అవయవాలకు ఈ చర్మాన్ని అమర్చడం ద్వారా మానవుల మాదిరిగానే స్పర్శ తెలుస్తుంది. రోబోలకు అమర్చేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల చర్మాలను తయారు చేశారు.
అయితే వీటిల్లో స్పర్శకు సంబంధించిన ఎలక్ట్రోడ్‌ల సంఖ్య చర్మం పరిమాణాన్ని బట్టి పెరగడం వల్ల ఖర్చు కూడా ఎక్కువవుతోంది. మరికొన్నింటిని ఆపరేట్ చేసేందుకు బయటి నుంచి బ్యాటరీలు, వైర్లు తదితరాలు అవసరం వస్తుండటంతో వాటిని వాడటం కష్ట సాధ్యమే. ఈ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీని పక్క నుంచి తేనెటీగ వెళ్లినా వెంటనే ఈ చర్మం గుర్తిస్తుంది.