కిమ్‌కు దక్షిణకొరియా అభ్యర్ధన
సియోల్: ఉత్తరకొరియాతో చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అణు సామర్ధ్యం కలిగిన క్షిపణి పరీక్షలను మానుకోవాలని ఉత్తరకొరియాను కోరింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఉత్తరకొరియాతో టూ-ట్రాక్ పాలసీని అవలంబించాలని భావిస్తున్నట్లు చెప్పింది.
కాగా, అమెరికాపై అణుదాడి చేస్తామని ఉత్తరకొరియా ఇప్పటికే పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియాకు ప్రపంచలో ఉన్న ఒక్కగానొక్క మిత్ర దేశం చైనా చెప్పినా అణుపరీక్షలపై వెనక్కు తగ్గేది లేదని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక అణు పరీక్షలు ఆపితే.. చర్చలకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ ప్రకటించారు. తాజాగా దక్షిణ కొరియా కూడా తమతో చర్చలు జరపాలని ఉత్తరకొరియా కోరింది. అమెరికా అభ్యర్ధనలను తిరస్కరించిన ఉత్తరకొరియా.. బద్ద శత్రువుతో చర్చలకు సై అంటుందా?.. చూద్దాం.