moon jae-in
-
ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం
సియోల్: అమెరికా, దక్షిణకొరియాలను కవ్వించేందుకు యత్నిస్తున్న ఉత్తరకొరియా ఆదివారం భారీ క్షిపణి ప్రయోగం జరిపింది. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఉత్తరకొరియా ఈ స్థాయి ప్రయోగం జరపడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్క జనవరిలోనే ఈ దేశం ఏడు క్షిపణి పరీక్షలు జరిపినట్లయింది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. ఈ ప్రయోగాన్ని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఖండించాయి. 2017 తర్వాత దీర్ఘస్థాయి క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించడం ఇదే తొలిసారి. ఐరాస విధించిన ఆంక్షలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా మిసైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తమపై విధించిన ఆంక్షలు తొలగించి చర్చలు పునఃప్రారంభించేలా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఈ చర్యలకు పాల్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. సైనిక శిక్షణ, రాజకీయంగా అమెరికాను ఇరుకున పెట్టడం, కొత్త సిస్టమ్స్ ఇంజినీరింగ్ అవసరాలు, విదేశాలకు విక్రయించేలా ప్రచారం కోసం, ఇంజినీరింగ్ సిస్టమ్స్ పరీక్షల కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే దేశ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఈ పరీక్షలని ఉత్తరకొరియా అధినేత కిమ్ ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలపై చర్చకు వెంటనే భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్‌ఇన్ పిలుపునిచ్చారు. పరిస్థితులన్నీ తిరిగి 2017లో ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కిమ్ ఈ చర్యలకు స్వస్తిపలకాలని కోరారు. చర్యను ఖండించిన యూ ఎస్ మాత్రం ఈ చర్య తమకు, తమ మిత్రులకు ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించింది. చైనాలో ఒలంపిక్స్ పూర్తైన తర్వాత ఉత్తరకొరి యా దూకుడు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మూన్ జే-ఇన్ కీలక నిర్ణయం.. ఇక కుక్కల మాంసం బంద్!
సియోల్: దక్షణి కొరియా ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నట్లు సోమవారం ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కుక్క మాంసం చాలాకాలంగా దక్షిణ కొరియా వంటకాలలో భాగంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారు 1 మిలియన్ కుక్కలు తింటారని అంచనా. అయితే మనుషులు కాలక్రమేణా పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. సోమవారం జరిగిన వారాంతపు సమావేశంలో మూన్ ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కలతో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఒక ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన కార్యాలయంలో అనేక కుక్కలను పెంచుకుంటున్నారు. చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో) దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు. అయితే మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని చెప్తున్నారు. చదవండి: (చైనాను బూచిగా చూపుతున్నాయి!) -
ఇక చాలు.. అన్నీ బంద్: ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఉత్తర కొరియా మంగళవారం వెల్లడించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు నెరపబోమని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇరు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో కరపత్రాలు పంచుతున్న కార్యకర్తలపై బెదిరింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సమసిపోలేదు. ఈక్రమంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు.. కిమ్ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతోపాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని వారం క్రితమే హెచ్చరించింది. అంతేకాకుండా ఉభయ కొరియాల పునర్ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని చెప్పింది. (చదవండి: కిమ్ సోదరి హెచ్చరిక.. తలొగ్గిన దక్షిణ కొరియా!) -
అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఘనవిజయం
-
అక్కసు వెళ్లగక్కిన కిమ్ జోంగ్ ఉన్
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై అక్కసు వెళ్లగక్కాడు. ఉత్తర కొరియాలోని నార్త్ డైమండ్ మౌంటేన్ రిసార్ట్‌పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలంటూ అధికారులను ఆదేశించారు. 'ఇటీవలే డైమండ్ మౌంటేన్ రిసార్ట్ ప్రాంతాన్ని సందర్శించాను. ఈ ప్రాంతంలో క్షిణ కొరియా నిర్మించిన హోటళ్లు మా దేశ జాతీయ భావాన్ని అభివర్ణించేవిగా లేవు. అందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నా' అని కిమ్ పేర్కొన్నారు. అయితే, ఏడాది కాలంగా ఇరు దేశాల మద్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ కిమ్‌తో మూడుసార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కిమ్ తాజా నిర్ణయం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. 'విభజనకు ముందు మా పూర్వీకులు డబ్బులకు ఆశపడి ఈ ప్రాంతాలను లీజుకిచ్చారు. అప్పటి నుంచి పది సంవత్సరాల వరకు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండానే అక్కడ హోటళ్లను, పర్యాటక నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో అవి గుడారాల్లాగా మిగిలిపోయాయి. మా పూర్వీకులు చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే.. పొరుగు దేశం నిర్మించిన భవనాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించాను’అని కిమ్ మీడియాతో అన్నారు. రాజధాని సియోల్‌లోనూ దక్షిణ కొరియాకు సంబంధించిన భవనాలను వెంటనే తొలగించేలా కిమ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు మౌంట్ కుమాంగ్ పర్వతంపై నిర్మించనున్న 'న్యూ మోడ్రన్ సర్వీస్ ఫెసిలిటీ'కి సంబంధించి దక్షిణ కొరియా అధికారులతో కిమ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. -
గాంధీ బోధనల్లో పరిష్కారం
సియోల్: ఉగ్రవాదం, వాతావరణ మార్పు అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలనీ, వీటికి పరిష్కారం మహాత్మా గాంధీ బోధనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే గాంధీ బోధనలు, విలువలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఆ దేశాధ్యక్షుడు మూన్–జే–ఇన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ–మూన్‌లతో కలిసి గాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్–దక్షిణ కొరియాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతం లక్ష్యంగా, మూన్–జే–ఇన్ ఆహ్వానం మేరకు మోదీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బోధనలు, విలువల్లోనే పరిష్కారం.. మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలైన ఉగ్రవాదం, వాతావరణ మార్పులకు గాంధీ బోధనలు, ఆయన జీవిత విలువల్లోనే పరిష్కారం ఉందని మోదీ అన్నారు. ‘మనం గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం. గాంధీ బోధనలు, ఆయన ఇచ్చిన ఐక్యతా స్ఫూర్తి, విలువలు, హింసా మార్గంలో వెళ్తున్న వారి మనసులను అహింసతో మార్చాలంటూ గాంధీ ఇచ్చిన సందేశాలే.. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు దారి చూపగలవు’ అని మోదీ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ–మూన్ ఉండగానే గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తర్వాతి తరాలకు హరిత గ్రహాన్ని అందించడం ముఖ్యమని గాంధీ బోధించారని తెలిపారు. మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి. -
ఆ ట్రెండ్ సెట్ చేసింది మోదీనే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు పంపించిన మోదీ జాకెట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన ట్వీట్ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. నెహ్రూ మార్కు జాకెట్లను మోదీ జాకెట్ అని సంబోధించడమేంటని కొందరు విరుచుకు పడుచుతుంటే మరికొంత మంది మాత్రం మోదీ వల్లే వాటికి ప్రత్యేకత సంతరించిందని మరికొందరు వాదిస్తున్నారు. కాగా ఈ విషయంపై జేడ్‌బ్లూ లైఫ్‌స్టైల్ ఇండియా ఎండీ బిపిన్ చౌహాన్ స్పష్టతనిచ్చారు. ‘నిజానికి వీటిన బంధ్గాలా అంటారు. ఒకప్పుడు నెహ్రూ, సర్దాన్ వల్లభబాయ్ పటేల్ వీటిని విరివిగా ధరించేవారు. ముఖ్యంగా నెహ్రూజీ బ్లాక్, హాఫ్ వైట్ షేడ్ జాకెట్లు మాత్రమే ధరించేవారు. అయితే గత కొన్నేళ్లుగా వివిధ రంగుల జాకెట్లు ధరిస్తూ.. మోదీజీ ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. వాటిని ప్రస్తుతం మోదీ జాకెట్లు అనే పిలుస్తున్నాం. మన ప్రధాని తరపున దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆ కోట్లు పంపింది మేమేనని’ చౌహాన్ పేర్కొన్నారు. మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే.. మూన్ జే ఇన్ ట్వీట్‌పై స్పందించిన కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ‘ మన ప్రధాని చాలా మంచి పనిచేశారు. కానీ ఆ వస్త్రాల పేరు మార్చకుంటే బాగుండేది. నాకు తెలిసి వాటిని నెహ్రూ జాకెట్లు అంటారు. కానీ ఇపుడు మోదీ జాకెట్లు అని పిలవడం చూస్తుంటే.. 2014 ముందటి భారత్ చరిత్రను మార్చివేసేలా ఉన్నారంటూ’ పేర్కొన్నారు. ’ మీరు మాట్లాడింది తప్పు. అవి నెహ్రూ జాకెట్లు. మాకైతే మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే గుర్తుకు వస్తుంది’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. Prime Minister @narendramodi of India sent me some gorgeous garments. These are modernized versions of traditional Indian costume, known as the ‘Modi Vest’, that can also be worn easily in Korea. They fit perfectly. pic.twitter.com/3QTFIczX6H — 문재인 (@moonriver365) October 31, 2018 It’s really nice of our PM to send these but could he not have sent them without changing the name? All my life I’ve known these jackets as Nehru jackets & now I find these ones have been labelled “Modi Jacket”. Clearly nothing existed in India before 2014. https://t.co/MOa0wY37tr — Omar Abdullah (@OmarAbdullah) October 31, 2018 Mr. President, You are wrong. This is not Modi Vest, this is Nehru jacket. Modi is no Nehru, can never be one. If anything Modi, that is Khaki Nikkar. https://t.co/8DrZ8b1RVM — Ashok Swain (@ashoswai) October 31, 2018 -
కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు
సియోల్: చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉ.కొరియాకు వెళ్లారు. ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు కిమ్–జొంగ్–ఉన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనానికి బయలుదేరారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి దారిపొడవునా వందలాది మంది ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ‘ప్రపంచం మొత్తం మమ్మల్ని గమనిస్తోంది. ప్రపంచ ప్రజలకు శాంతి, సంపదను సాధించడమనే బృహత్తర బాధ్యత నాపై ఉంది’ అనంతరం మూన్ మీడియాతో అన్నారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. సంపూర్ణ అణునిరాయుధీకరణ జరగాలని అమెరికా పట్టుబడుతుండగా, తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర కొరియా కోరుతోంది. గత పదేళ్లలో ద.కొరియా అధ్యక్షుడొకరు ఉ.కొరియాలో పర్యటించడం ఇదే ప్రథమం. -
‘నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’
దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్పూల్లే కాకుండా పార్కులు ఇతర బహిరంగప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ’ నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు వెళ్లింది. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. దీని ద్వారా మహిళలపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్ పార్టీ నేత యాన్ హి–జింగ్‌తో సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తుతున్నారు. పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లు, బీచుల్లోని రెస్ట్రూమ్లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీస బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న దానిని కనిపెట్టే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారు. పెరుగుతున్న రహస్య కెమెరా బాధితులు 2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్ యాంగ్ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్ ఓహ్ యూన్–సంగ్ పేర్కొన్నారు. ‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జో–ఇన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని పోలీసులు గుర్తించగా, 2017 వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోంది. అధికారులకు సవాలే... బేస్‌బాల్ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్సెంటర్లు, బీచులు, స్విమ్మింగ్ పూల్‌లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్లైన్, ఇతర వెబ్ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెమెరా హార్డ్‌వేర్ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్ యంగ్–మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణకొరియా్ అధ్యక్షుడు
-
కిమ్ జాంగ్‌కు సర్ప్రైజ్.. ఉత్కంఠ!
సియోల్: ఆది నిష్టూరమే మేలనిపించేలా.. శత్రువులుగా ఉన్నప్పటి కంటే, స్నేహితులుగా మారుదామనుకున్న తర్వాత కిమ్-ట్రంప్‌ల వైఖరి మరింత విసుగు కలిగించే రీతిలో క్షణక్షణానికి మారుతోంది. జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతల భేటీ యవ్వారం గంటకో మలుపు తిరుగుతోంది. ఒకసారి కిమ్ ‘అసలు చర్చలే లేవు’ అంటే.. ఇంకోసారి ట్రంప్ ‘ఠాట్ ఆయనతో నేను మాట్లాడబోను..’ అని ప్రకటిస్తారు. ఉద్రిక్తతను నివారించి, చర్చలు సజావుగా సాగేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చర్చల తేదీ(జూన్ 12) దగ్గర పడుతుండటంతో ఇక దక్షిణకొరియానే నేరుగా రంగంలోకి దిగింది. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ శనివారం అకస్మాత్తుగా ఉత్తరకొరియాకు వెళ్లి కిమ్ జాంగ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. సరిహద్దులోని పన్ముంజోమ్ గ్రామంలో ఇరు నేతలూ సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ మేరకు దక్షిణకొరియా అధ్యక్షుడి అధికారిక భవనం బ్లూ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలకు కిమ్ ఒప్పుకున్నట్టేనా?: ఉత్తరకొరియాతో అమెరికా చర్చలకు సంబంధించి రోజురోజుకూ మారుతోన్న పరిణామాలపై కిమ్-మూన్‌లు చర్చించారని, భేషజాలకు పోకుండా చర్చలకు సిద్ధంకావాలని కిమ్‌కు మూన్ సూచించారని బ్లూహౌస్ పేర్కొంది. అయితే, ట్రంప్‌తో చర్చలకు కిమ్ ఒప్పుకున్నది లేనిది.. మూన్ రేపు(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రకటిస్తారని, అప్పటిదాకా ఉత్కంఠ తప్పదని దక్షిణకొరియా అధికారగణం పేర్కొంది. అమెరికాతో చర్చల అంశంతోపాటు రెండు కొరియా దేశాల మధ్య కొనసాగుతోన్న మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా కిమ్-మూన్‌లు భావిస్తున్నారని, ఆమేరకు అవసరమైన చర్యలను వేగవంతం చేశారని బ్లూహౌస్ తెలిపింది. (చూడండి: కిమ్‌కు ట్రంప్ కళ్లెం వేశారా?) (చదవండి: మరోసారి మాట మార్చిన ట్రంప్) -
ఆ దేశాల మధ్య ‘కలిసిన కాలం’
సాక్షి, సియోల్ : కాలం కలసి రావడం అంటే ఇదేనేమో! ఆగర్భ శత్రు దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్, మూన్ఝా ఇన్లు రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం మొన్న చేతులు కలపగా, ఆ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా నేడు మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అరగంట సమయం తేడా ఉంది. దక్షిణ కొరియా కన్నా ఉత్తర కొరియా గడియారం అరగంట ఆలస్యం. ఈ తేడాను వచ్చే మే ఐదవ తేదీ నుంచి సవరిస్తామని, తమ సమయాన్ని 30 నిమిషాలపాటు వెనకకు జరుపుకుంటామని కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే హామీ ఇవ్వగా అందుకు ప్రతిగా తమ దేశ ప్రచార ఆర్భాటం కోసం ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భారీ మైకులను తొలగించి వేస్తున్నామని మూన్ఝా ఇన్ సోమవారం నాడు ప్రకటించారు. గ్రీన్విచ్ సమయం కాన్న తొమ్మిది గంటలు ముందు దక్షిణ కొరియా సమయం ఉంటుంది. మొదటి నుంచి జపాన్‌ది దక్షిణ కొరియాది ఒకే టైమ్‌జోన్. జపాన్ దేశం నుంచి విముక్తి పొందిన 70 వార్షికోత్సవం సందర్భంగా అంటే 2015లోనే ఉత్తరకొరియా తన టైమ్ జోన్‌ను మార్చుకుంది. మళ్లీ పాత సమయానికి రానుంది. ఇరుదేశాధినేతల మధ్య శుక్రవారం జరిగిన శిఖరాగ్ర సమావేశాల సందర్భంగానే దక్షిణ కొరియా, ఉత్తరకొరియా సరిహద్దుల్లోనే తన మైకులను ఆఫ్ చేయగా, మంగళవారం నుంచి వాటిని పూర్తిగా ఎత్తువేస్తున్నామని ఇవాళ ప్రకటించింది. -
అమెరికా సమక్షంలో వాటిని ఆపేస్తాం: కిమ్
ప్యాంగ్యాంగ్ (దక్షిణ కొరియా) : ఉత్తరం, దక్షిణం కలిసిపోయాయి. అదేనండి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య గత శుక్రవారం చారిత్రక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలనమైన, ప్రపంచ దేశాలు ఉపిరి పిల్చుకునే నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఇన్ తెలిపారు. భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్ పరీక్షలను, తయారీని వచ్చే నెల మే లో నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అగ్రరాజ్యం అమెరికా ఆయుధ నిపుణులను ఆహ్వానించి వారి సమక్షంలోనే దానిని డిస్మాంటిల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు పారద్శకంగా ఉండేందుకు అమెరికా, దక్షిణ కొరియా ఆయుధ నిపుణుల ముందు ఈ న్యూక్లియర్ ప్లాంట్‌ను డిస్మాంటిల్ చేయనున్నారు. ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా అధ్యక్షుడికి, జపాన్ అధ్యక్షుడు షిన్జో అబెకి ఫోన్ చేసి, అంతా సవ్యంగానే జరుగుతుందని అన్నారు. ఉత్తర కొరియా నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. -
కిమ్‌కు దక్షిణకొరియా అభ్యర్ధన
సియోల్: ఉత్తరకొరియాతో చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అణు సామర్ధ్యం కలిగిన క్షిపణి పరీక్షలను మానుకోవాలని ఉత్తరకొరియాను కోరింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఉత్తరకొరియాతో టూ-ట్రాక్ పాలసీని అవలంబించాలని భావిస్తున్నట్లు చెప్పింది. కాగా, అమెరికాపై అణుదాడి చేస్తామని ఉత్తరకొరియా ఇప్పటికే పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియాకు ప్రపంచలో ఉన్న ఒక్కగానొక్క మిత్ర దేశం చైనా చెప్పినా అణుపరీక్షలపై వెనక్కు తగ్గేది లేదని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక అణు పరీక్షలు ఆపితే.. చర్చలకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ ప్రకటించారు. తాజాగా దక్షిణ కొరియా కూడా తమతో చర్చలు జరపాలని ఉత్తరకొరియా కోరింది. అమెరికా అభ్యర్ధనలను తిరస్కరించిన ఉత్తరకొరియా.. బద్ద శత్రువుతో చర్చలకు సై అంటుందా?.. చూద్దాం.