సాక్షి, సియోల్ : కాలం కలసి రావడం అంటే ఇదేనేమో! ఆగర్భ శత్రు దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్, మూన్‌ఝా ఇన్‌లు రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం మొన్న చేతులు కలపగా, ఆ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా నేడు మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అరగంట సమయం తేడా ఉంది. దక్షిణ కొరియా కన్నా ఉత్తర కొరియా గడియారం అరగంట ఆలస్యం. ఈ తేడాను వచ్చే మే ఐదవ తేదీ నుంచి సవరిస్తామని, తమ సమయాన్ని 30 నిమిషాలపాటు వెనకకు జరుపుకుంటామని కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే హామీ ఇవ్వగా అందుకు ప్రతిగా తమ దేశ ప్రచార ఆర్భాటం కోసం ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భారీ మైకులను తొలగించి వేస్తున్నామని మూన్‌ఝా ఇన్ సోమవారం నాడు ప్రకటించారు.
గ్రీన్‌విచ్ సమయం కాన్న తొమ్మిది గంటలు ముందు దక్షిణ కొరియా సమయం ఉంటుంది. మొదటి నుంచి జపాన్‌ది దక్షిణ కొరియాది ఒకే టైమ్‌జోన్. జపాన్ దేశం నుంచి విముక్తి పొందిన 70 వార్షికోత్సవం సందర్భంగా అంటే 2015లోనే ఉత్తరకొరియా తన టైమ్ జోన్‌ను మార్చుకుంది. మళ్లీ పాత సమయానికి రానుంది. ఇరుదేశాధినేతల మధ్య శుక్రవారం జరిగిన శిఖరాగ్ర సమావేశాల సందర్భంగానే దక్షిణ కొరియా, ఉత్తరకొరియా సరిహద్దుల్లోనే తన మైకులను ఆఫ్ చేయగా, మంగళవారం నుంచి వాటిని పూర్తిగా ఎత్తువేస్తున్నామని ఇవాళ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment