బిల్లు కట్టకుండా.. 120 మంది..
బిల్లు కట్టకుండా.. 120 మంది..
Published Fri, Mar 3 2017 10:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
ఫంక్షన్ పేరుతో ఓ స్పెయిన్ రెస్టారెంట్‌ను ఓ గ్రూపు మోసగించి పారిపోయింది. బెంబ్రీలోని హోటల్ కార్మెన్‌లో బాప్టిజం సమావేశాన్ని నిర్వహించేందుకు రొమేనియన్లకు చెందిన ఓ గ్రూపు రూ.62 వేలను అడ్వాన్సుగా చెల్లించింది. మిగిలిన రూ.1.4 లక్షలను కార్యక్రమం అనంతరం చెల్లిస్తామని హోటల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 120 మంది రొమేనియన్లు గురువారం హోటల్‌లో ఫంక్షన్‌కు హాజరై తమ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
ఈ సమయంలో 30 బాటిళ్ల మద్యాన్ని సేవించారు. హోటల్ సిబ్బంది వారికి భోజన ఏర్పాట్లు చేసేలోపు అందరూ అక్కడి నుంచి ఊడాయించారు. దీంతో హోటల్ యజమాని రోడ్రిగేజ్ ఘటనపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement