hotel bill
-
వైరల్: సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు!!
Turkey Stylish Chef Salt Bae Bill: కొత్తగా మొదలైన రెస్టారెంట్ అది. అయినా లోపల సీట్లు ఫుల్ అయ్యాయి. బయటేమో జనాలు క్యూ కట్టి ఉన్నారు. ఇంతలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలోని బిల్ చూపించాడు. సింగిల్ మీల్ రేటు మరీ అంతా? అని ఆశ్చర్యపోయారంతా. అలాగని వాళ్లేం కంగారుపడి వెనక్కి వెళ్లిపోయారనుకునేరు. ఏదేమైనా సరే.. ఎంత ఖర్చైనా ఆ రెస్టారెంట్లో ఒక్కసారైనా తిని తీరాల్సిందేనని తమ వంతు కోసం ఎదురుచూశారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్ ‘కాస్ట్లీ’ బిల్లు ఇప్పడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సింగిల్ మీల్‌కు 1800 పౌండ్లు(మన కరెన్సీలో ఒక లక్షా ఎనభై వేలు).. లండన్‌లో కొత్తగా మొదలైన నుస్ర్-ఇట్ రెస్టారెంట్ వేసిన ఛార్జ్ ఇది. కేవలం ఆ రెస్టారెంట్ చీఫ్ చెఫ్ సర్వ్ చేశాడన్న ఒక కారణంతో అంతేసి బిల్ వేశారు. వ్యాపారంలో సక్సెస్‌కి ప్రధాన సూత్రం.. కరెక్ట్ మార్కెటింగ్. అది లేకుంటే క్వాలిటీ ఎంతున్నా, ఎన్ని వ్యూహాలు పాటించినా ప్రయోజనం ఉండదు. గల్లీలో రుచికరమైన వంటలు వండే నుస్రెట్ గోక్సె.. తన హోటల్ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్ చేసుకున్నాడు. వెరైటీ స్టయిల్‌తో సర్వింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి ఊహించని రేంజ్లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎంత ఖర్చైనా సరే అతని స్టైల్‌ను తాకిన తిండిని తినాలని జనాలు క్యూ కట్టేంతగా మార్చేసింది. Salt Bae is the world's greatest living artist pic.twitter.com/ZZMydLsoah — Francisco Garcia (@Ffranciscodgf) September 27, 2021 నుస్రెట్ నుస్రెట్ గోక్సె.. టర్కీ షెఫ్. మాంసాన్ని కట్ చేసే తీరు.. మోచేతి మీదుగా ఇస్టయిల్‌గా సాల్ట్‌ను, మసాలాను మాంసం మీద చల్లుతూ చాలామందిని ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన నుస్రెట్ గోక్సె.. 2010-17 మధ్య చాలా దేశాలు తిరిగి పాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 2017లో టర్కీలోని ఓ ఇరుకుగల్లీలోని తన చిన్నిదుకాణంలో ఉన్న ఇతను.. స్టయిల్‌గా సాల్ట్, మసాలా చల్లే తీరు.. ‘సాల్ట్ బే’గా ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. మీమ్‌గా అతని ఫొటో బాగా పాపులర్ అయ్యింది. విపరీతమైన క్రేజ్‌తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బ్రాండ్స్ ప్రమోటర్‌గా బోలెడంత డబ్బు కూడా వచ్చిందతనికి. దీంతో ప్రపంచంలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. తాజాగా సెప్టెంబర్ 23న లండన్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేయగా.. అందులోని సింగిల్ మీల్ తాలుకా బిల్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) చదవండి: ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్ -
అప్పులు చేసి.. బిల్లులు కట్టి..
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి బతుకుజీవుడా అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టి న ప్రవాసీలను హోం క్వారంటైన్ ఆర్థికంగా మ రింత చితికిపోయేలా చే స్తోంది. వందేభారత్ మి షన్లో భాగంగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారి ని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేయగా, తెలంగాణవాసుల కోసం 40 విమానాలను నడిపారు. అయితే, అత్యధికంగా తరలివచ్చిన కేరళీయుల కోసం అక్కడి ప్రభుత్వం ఉచిత క్వారం టైన్ సౌకర్యం కల్పించింది. మన ప్రభుత్వం క్వా రంటైన్ కోసం అదనంగా చార్జీలను వసూలు చేసింది. తొలుత ఉచిత క్వారంటైన్ అని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు విమాన చార్జీలు సాధారణ చార్జీలకంటే అదనం గా 10–15శాతం ఎక్కువ వసూలు చేశారు. చార్జీలను లెక్కచేయకుండా స్వదేశంలో అడుగుపెట్టిన ప్రవాసీలను క్వారంటైన్ కష్టాలు వెంటా డాయి. విమానాలు దిగగానే పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్వారంటైన్ ముగిశాకే హోటల్ బిల్లు, మెస్ బిల్లు చెల్లించిన తర్వాతే వాటిని తిరిగి అప్పగిస్తున్నారు. దీంతో వలసజీవులు లబోదిబోమంటున్నారు. 90 శాతం మంది కార్మికులే.. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న తెలంగాణ వాసులలో 90 శాతం మంది కార్మికులే ఉంటున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం ఉంటుంది. ఒక్కో కార్మికునికి కొన్ని కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అటు వేతనాలు లేక ఇటు ఇంటికి రావడానికి అప్పుచేసి టికెట్ కొనుగోలు చేస్తే, వా రు క్వారంటైన్ చార్జీలను అదనంగా మోయాల్సి వస్తోంది. క్వారంటైన్ కోసం తమను హైదరాబాద్ పరిసరాల్లోని హోటళ్లలో ఉంచే బదులు ఇంటికి పంపిస్తే తూ.చ.తప్పకుండా క్వారంటైన్ నిబంధనలను పాటిస్తామని వలస కార్మికులు చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉచితంగా వసతి ఏర్పాటు చేసినా భోజనానికి మాత్రం చార్జీలు వసూలు చేస్తున్నారు. -
బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..
సాక్షి, మహానంది : హోటల్‌కు వచ్చాడు.. జొన్నరొట్టె.. చికెన్ తదితర వాటిని ఆర్డర్ చేశాడు.. కడుపునిండా తిన్నాడు.. బిల్లు చెల్లించమని అడిగితే మద్యం మత్తులో గొడవపడి హోటల్ నిర్వాహకుడి కుమారుడి చెవిని కొరికాడు.. ఈ ఘటన మండలంలోని గాజులపల్లెలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంగస్వామి, లక్ష్మి గాజులపల్లె మెట్ట వద్ద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు మహేష్ హోటల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పనిచేస్తున్నాడు. రొట్టె, పప్పు, చికెన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి హోటల్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వచ్చాడు. కడుపు నిండా తిని సుమారు రూ. 200 బిల్లు చేశాడు. తిన్నవాటికి డబ్బులు ఇవ్వాలని అడుగగా వారితో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శివదీక్షలో ఉన్న మహేష్ చెవిని శ్రీను కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 16 కుట్లు పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. వారు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: సహజంగా వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. అలాగే ఫ్లయిట్ దిగినప్పుడు ఐదు, పది నిమిషాల పాటు తమను కలిసేందుకు వచ్చిన ప్రముఖులతో భేటీ అవుతారు. ఆ సందర్భంగా టీ, కాఫీ, స్నాక్స్ తీసుకోవడం సహజం. ఆ మేరకు సర్వ్ చేసి.. ఎయిర్‌పోర్ట్‌లో సదరు రెస్టారెంట్లు ఇచ్చిన బిల్లులను జిల్లా ప్రొటోకాల్ అధికారులు చెల్లిస్తారు. ఇదంతా ఎక్కడైనా సాధారణమే. కానీ గత ఐదేళ్ళలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబునాయుడు, ఈయన అకౌంట్లోనే తనయుడు లోకేష్‌బాబులు టీ, కాఫీ, స్నాక్స్ కోసం చేసిన ఖర్చు అక్షరాలా పాతిక లక్షల రూపాయలు. ఔను.. మీరు చదివింది కరెక్టే.. టీడీపీ నేతలు, అప్పటి మంత్రులతో సహా వారిద్దరూ వచ్చినప్పుడు మొత్తంగా అయిన ఖర్చు పాతిక లక్షలని తేల్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2016 వరకు దాదాపు రూ.12లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు చెల్లించారు. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు. ఈ బిల్లును మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఆ బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. కానీ అన్నేసి లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్ధం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లోకేష్ బిల్లూ...బాబు అకౌంట్లోనే సహజంగా సీఎం ప్రొటోకాల్‌తో పోలిస్తే మంత్రి ప్రొటోకాల్ తక్కువే ఉంటుంది. కానీ గత టీడీపీ హయాంలోని ఐదేళ్ళలో ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు తనయుడు లోకేష్ వచ్చినా బాబుకిచ్చే ప్రొటోకాల్‌నే అనుసరించిన అప్పటి అధికారులు ఆ మేరకు టీ. కాఫీ, స్నాక్స్ బిల్లులను కూడా ఇబ్బడిముబ్బడి చేసేశారు. మొత్తంగా చంద్రబాబు కంటే లోకేష్‌బాబు వచ్చినప్పుడే బిల్లులు భారీ స్థాయిలో అయ్యేవని తేలింది. -
హోటల్ బిల్లు ఎగ్గొట్టిన వైద్యుడిపై కేసు
బంజారాహిల్స్: హోటల్ బిల్లు ఎగ్గొట్టి వెళ్లిన వైద్యుడిపై చర్య తీసుకోవాలంటూ హోటల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన డాక్టర్ అపరాజిత్ బాసక్ కుటుంబంతో కలిసి గత నెల 22న బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్‌ఎన్‌ఎం హోటల్‌కు వచ్చాడు. తాను తొమ్మిది రోజులు బస చేస్తానని చెప్పి సంబ ంధిత పత్రాలు అందజేశాడు. ఇందుకు రూ.80 వేల బిల్లు అవుతుందని ఇందులో సగం మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని హోటల్ మేనేజర్ మిశ్రా సూచించాడు. తాను బాగా అలిసిపోయానని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం డబ్బులు చెల్లిస్తానని చెప్పి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. అయితే రెండు, మూడు రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోగా, ఇప్పుడు..అప్పుడు అంటూ తప్పించుకునేవాడు. మంగళవారం తెల్లవారుజామున హోటల్ సిబ్బంది కళ్లుగప్పి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ హోటల్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ అపరాజిత్ ఇచ్చిన ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీని ఫిర్యాదుతో జతపర్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిల్లు కట్టలేక.. ప్రాణాలకు తెగించి.!
-
బిల్లు కట్టలేక.. ప్రాణాలకు తెగించి.!
మనం హోటల్‌కి వెళ్లి పుష్టిగా తిన్నాక జోబిలో పర్సు లేకుంటే ఆ సమస్య ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి సమస్య ఎదురైనపుడు చుట్టూ చూసి ఎవరూ లేనపుడు పారిపోవడం లేదా అందరూ ఉంటే హోటల్లో ప్లేట్లు కడగటం మనం సినిమాల్లో చూసుంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా చైనాలో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి. అతను ఎంత బిల్లు చేశాడో తెలియదు కానీ ప్రాణాలకు తెగించి పారిపోవాలనుకున్నాడు. సుమారు 19 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిటికీ ద్వారా ఉన్న టెలిఫోన్ తీగల సహాయంతో రోడ్డు పక్కన మరొక బిల్డింగ్‌లోకి వెళ్లాడు. చాలా సేపు గాలిలో చక్కర్లు కొడుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొని చివరికి పక్క బిల్డింగ్ చేరుకున్నాడు. మార్గ మధ్యమంలో ఒక్కసారిగా అదుపుతప్పి తీగల మధ్యకు ఇరుకున్నాడు. అదృష్టమశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు అతన్ని పట్టుకొని చివరికి వదిలిపెట్టారు. ఈ సంఘటన చైనాలోని గ్విజౌలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను తమ సెల్ ఫోన్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
బిల్లు కట్టకుండా.. 120 మంది..
ఫంక్షన్ పేరుతో ఓ స్పెయిన్ రెస్టారెంట్‌ను ఓ గ్రూపు మోసగించి పారిపోయింది. బెంబ్రీలోని హోటల్ కార్మెన్లో బాప్టిజం సమావేశాన్ని నిర్వహించేందుకు రొమేనియన్లకు చెందిన ఓ గ్రూపు రూ.62 వేలను అడ్వాన్సుగా చెల్లించింది. మిగిలిన రూ.1.4 లక్షలను కార్యక్రమం అనంతరం చెల్లిస్తామని హోటల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 120 మంది రొమేనియన్లు గురువారం హోటల్లో ఫంక్షన్‌కు హాజరై తమ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సమయంలో 30 బాటిళ్ల మద్యాన్ని సేవించారు. హోటల్ సిబ్బంది వారికి భోజన ఏర్పాట్లు చేసేలోపు అందరూ అక్కడి నుంచి ఊడాయించారు. దీంతో హోటల్ యజమాని రోడ్రిగేజ్ ఘటనపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి
హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు * జనవరి 1 నుంచి అమల్లోకి * దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు. బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా .. క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు. విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్నింట ఊరట.. సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.