
మనం హోటల్‌కి వెళ్లి పుష్టిగా తిన్నాక జోబిలో పర్సు లేకుంటే ఆ సమస్య ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి సమస్య ఎదురైనపుడు చుట్టూ చూసి ఎవరూ లేనపుడు పారిపోవడం లేదా అందరూ ఉంటే హోటల్లో ప్లేట్లు కడగటం మనం సినిమాల్లో చూసుంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా చైనాలో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.
అతను ఎంత బిల్లు చేశాడో తెలియదు కానీ ప్రాణాలకు తెగించి పారిపోవాలనుకున్నాడు. సుమారు 19 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిటికీ ద్వారా ఉన్న టెలిఫోన్ తీగల సహాయంతో రోడ్డు పక్కన మరొక బిల్డింగ్‌లోకి వెళ్లాడు. చాలా సేపు గాలిలో చక్కర్లు కొడుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొని చివరికి పక్క బిల్డింగ్ చేరుకున్నాడు. మార్గ మధ్యమంలో ఒక్కసారిగా అదుపుతప్పి తీగల మధ్యకు ఇరుకున్నాడు. అదృష్టమశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు అతన్ని పట్టుకొని చివరికి వదిలిపెట్టారు. ఈ సంఘటన చైనాలోని గ్విజౌలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను తమ సెల్ ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment