జపాన్లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత
టోక్యో : జపాన్ నైరుతీ తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా సునామీ వచ్చే సూచనలు లేవని స్థానిక ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది.
ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్ణం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జపాన్ వాతావరణ సంస్థ, యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థలు సంయుక్తం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సదరు ప్రాంతంలో నడిచే బుల్లెట్ రైళ్లను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు మీడియా సంస్థ ప్రకటించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.