japan coast
-
జపాన్ తీరంలో భారత్ నౌక ఫ్లీట్ రివ్యూ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): సముద్ర తీరం మధ్యలో నౌక అగ్నిప్రమాదానికి గురైతే ఆ నౌకలో ఉన్న వారిని ఎలా కాపాడాలి? ఆ నౌక మరింత ప్రమాదానికి గురికాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై భారత్ నౌకా సిబ్బంది చేసిన విన్యాసం ఆకట్టుకుంది. జపాన్‌లోని యోకోసుకా సముద్ర తీరం వద్ద కొద్ది రోజులుగా ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. మంగళవారం యోకోసుకా తీరం వద్ద భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ కమోర్జా నౌకా సిబ్బంది విన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పది దేశాల నుంచి సుమారు 23 యుద్ధ నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు కూడా పాల్గొని తీరంపై విన్యాసాలు చేశాయి. -
కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ
వాషింగ్టన్: అమెరికా నేవికి చెందిన యుద్ధనౌక ఒకటి జపాన్ సముద్ర తీరంలో ఓ కార్గో నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది అమెరికా నేవీ సిబ్బందితోపాటు కార్గో సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వేకువ జామున 2.30 గంటల 3.00గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని యోకోసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన ఫిట్జరాల్డ్ అనే ఓ క్షిపణి విధ్వంసక నౌక, పిలిప్పీన్స్ జెండాను కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో నౌక సరిగ్గా 2.30గంటల ప్రాంతంలో అతి సమీపంగా వచ్చాయని ఆ సమాయంలోనే ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నట్లు అమెరికాకు చెందిన ఏడో నేవీ దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ద నౌకలో దాదాపు 330మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల ఓ చోట రంధ్రం ఏర్పడి నీరు లోపలికి వస్తుందని, దాన్ని తాము నియంత్రించగలమని చెప్పారు. -
కిమ్ జోంగ్.. మరో దుస్సాహసం!
-
కిమ్ జోంగ్.. మరో దుస్సాహసం!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో దుస్సాహసం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఏకంగా నాలుగు ఖండాంతర క్షిపణులను జపాన్ తీరానికి సమీపంలోని సముద్రంలోకి ప్రయోగించారు. ఈ విషయాన్ని జపాన్ ప్రధానమంత్రి షింజో అబె వెల్లడించారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతమైన టాంగ్‌చాంగ్ - రి వద్ద నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోకి పలు ఖండాంతర క్షిపణులను వాళ్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం కూడా తెలిపింది. ఈ విషయమై తమకు అందిన సమాచారాన్ని అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక అధ్యక్షుడు హ్వాంగ్ క్యో-ఆన్ కూడా అత్యవసరంగా జాతీయ భద్రతపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు జపాన్ కూడా ఉత్తరకొరియా చర్యలను తీవ్రంగా నిరసించింది. ఈ క్షిపణి పరీక్షలు తమ సార్వభౌమత్వానికి ముప్పని అంటోంది. భద్రతామండలి తీర్మానాలకు ఇవి విరుద్ధంగా ఉన్నాయని, ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని ప్రధాని షింజో అబె అన్నారు. అయితే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లినట్లు సమాచారం లేదని జపనీస్ అధికారులు చెప్పారు. అయితే అమెరికా మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించిన మాట తమకు తెలుసని మాత్రం ఓ అధికారి అన్నారు. దక్షిణకొరియా, అమెరికా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంతో.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరకొరియా ఇటీవలే హెచ్చరించింది. ఆ తర్వాత అన్నంత పనీ చేసింది. -
దూసుకొస్తున్న భారీ టైఫూన్
-
జపాన్‌కు భారీ టైఫూన్ దెబ్బ
అత్యంత శక్తిమంతమైన చాబా అనే టైఫూన్ ఒకటి జపాన్ వైపు వేగంగా దూసుకొస్తోంది. దాంతో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణ కొరియాలోని ఒక రిసార్ట్ దీవిని తాకిన ఈ టైఫూన్.. అక్కడ విధ్వంసం సృష్టించడంతో ఇప్పటికే పలు విమానాలు రద్దయ్యాయి, వీధుల్లో వరద ఉప్పొంగుతోంది. ప్రస్తుతం ఇది జపాన్‌లోని త్సుషిమా నగరానికి ఉత్తర ఈశాన్యంగా వస్తోందని, దీనిప్రభావంతో గంటకు 180 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలతో పాటు అలలు కూడా పెద్ద ఎత్తున ఎగుస్తాయని, వరదలు వస్తాయని, జపాన్ పశ్చిమభాగంలోని చాలా ప్రాంతం అల్లాడుతుందని అంటున్నారు. జపాన్‌లోని ప్రధాన ప్రాంతమైన హొన్షును బుధవారం సాయంత్రానికి ఇది తాకొచ్చని, తర్వాత పసిఫిక్ సముద్రంవైపు వెళ్తుందని వెదర్ జపాన్ పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున ఇది దక్షిణ కొరియాలోని రిసార్ట్ దీవి జెజును తాకింది. దాంతో అక్కడ భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ఫలితంగా జెజుకు వచ్చే, అక్కడినుంచి వెళ్లే విమానాలను రద్దుచేశారు. చైనా పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. జెజు దీవలోని 25 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుసాన్ నగరంలోని 900 పాఠశాలలను మూసేశారు. ఒడ్డున నిలిపి ఉంచిన ఒక ఫెర్రీలో ఉన్న ఆరుగురు సిబ్బందిని ఓ భారీ కెరటం సముద్రంలోకి లాక్కెళ్లిపోతున్న దృశ్యాలను వైటీఎన్ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. అయితే తర్వాత ఆ ఆరుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జపాన్‌లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత
టోక్యో : జపాన్ నైరుతీ తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా సునామీ వచ్చే సూచనలు లేవని స్థానిక ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్ణం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జపాన్ వాతావరణ సంస్థ, యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థలు సంయుక్తం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సదరు ప్రాంతంలో నడిచే బుల్లెట్ రైళ్లను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు మీడియా సంస్థ ప్రకటించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.