
ఆపదలో ఉన్న నౌకపై అగ్నిమాపక పరికరాలతో కాపాడే విన్యాసం చూపుతున్న భారత్ నౌకా సిబ్బంది
మల్కాపురం(విశాఖ పశ్చిమ): సముద్ర తీరం మధ్యలో నౌక అగ్నిప్రమాదానికి గురైతే ఆ నౌకలో ఉన్న వారిని ఎలా కాపాడాలి? ఆ నౌక మరింత ప్రమాదానికి గురికాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై భారత్ నౌకా సిబ్బంది చేసిన విన్యాసం ఆకట్టుకుంది. జపాన్‌లోని యోకోసుకా సముద్ర తీరం వద్ద కొద్ది రోజులుగా ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది.
మంగళవారం యోకోసుకా తీరం వద్ద భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ కమోర్జా నౌకా సిబ్బంది విన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పది దేశాల నుంచి సుమారు 23 యుద్ధ నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు కూడా పాల్గొని తీరంపై విన్యాసాలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment