Fleet Review
-
జపాన్ తీరంలో భారత్ నౌక ఫ్లీట్ రివ్యూ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): సముద్ర తీరం మధ్యలో నౌక అగ్నిప్రమాదానికి గురైతే ఆ నౌకలో ఉన్న వారిని ఎలా కాపాడాలి? ఆ నౌక మరింత ప్రమాదానికి గురికాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై భారత్ నౌకా సిబ్బంది చేసిన విన్యాసం ఆకట్టుకుంది. జపాన్‌లోని యోకోసుకా సముద్ర తీరం వద్ద కొద్ది రోజులుగా ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. మంగళవారం యోకోసుకా తీరం వద్ద భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ కమోర్జా నౌకా సిబ్బంది విన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పది దేశాల నుంచి సుమారు 23 యుద్ధ నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు కూడా పాల్గొని తీరంపై విన్యాసాలు చేశాయి. -
President Fleet Review 2022: ఘనంగా రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ
-
విశాఖలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ (ఫోటోలు)
-
రాష్ట్రపతి కోవింద్ కు స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రపతి కోవింద్ కు ఘన స్వాగతం పలకనున్న సీఎం జగన్
-
విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
విశాఖకు ప్రముఖల తాకిడి.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు. ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి (ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్) బి.ఆనంద్, కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెకట్రరీ ఆర్.పి.సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాధరావు, బి.కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు. -
సీఎం జగన్ విశాఖ టూర్ కి సర్వం సిద్ధం
-
5న విశాఖకు ప్రణబ్, మోదీ
ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి, ప్రధాని సాక్షి, విశాఖపట్నం: ఫిబ్రవరి 4 నుంచి విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటన శుక్రవారం అధికారికంగా ఖరారైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 5న రాత్రి 9.10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయంలోనే ఉన్న ఐఎన్ఎస్ డేగాలో రాత్రికి బస చేస్తారు. 6వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11.45 వరకు ఐఎఫ్ఆర్ను యుద్ధనౌక నుంచి సమీక్షిస్తారు. సాయంత్రం 5.20 గంటలకు ఇండియన్ నేవీ బ్యాండ్ కన్సెర్ట్ అనంతరం ఐఎఫ్ఆర్ శిల్పాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాముద్రిక నేవల్ ఆడిటోరియంలో పోస్టల్ స్టాంపు విడుదల చేస్తారు. రాత్రి 7.40 నుంచి 9 గంటల వరకు తూర్పు నావికాదళ ఆఫీసర్ల మెస్‌లో అతిథులకు ఇచ్చే ప్రెసిడెన్షియల్ విందులో పాల్గొంటారు. ఏడో తేదీ ఉదయం 11 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని 11.20 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు. ప్రధాని పర్యటన ఇలా.. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.35 గంటలకు నేవీ అతిథి గృహానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆరో తేదీ ఉదయం 8.15 గంటలకు నేవీ అతిథి గృహం నుంచి బయల్దేరి 8.30 గంటలకు ఐఎఫ్ఆర్ వేదిక వద్దకు వెళ్తారు. 11.45 గంటల వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9.25 గంటలకు విమానంలో భువనేశ్వర్ వెళ్తారు. ఏడో తేదీ సాయంత్రం 4.35 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి వస్తారు. 4.55 గంటలకు ఐఎఫ్ఆర్ వేదిక వద్దకు చేరుకుంటారు. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే సిటీ పరేడ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి గౌరవార్థం అతిథులకు విందునిస్తారు. రాత్రి 9.25 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారు. భారత్‌లో ఫ్లీట్‌కు తొలిసారి చైనా.. చైనా తొలిసారిగా భారత్‌లో జరగనున్న ఐఎఫ్ఆర్లో పాల్గొనబోతోంది. కాగా ఈ ఫ్లీట్‌కు ముందస్తుగా మూడు రోజుల పాటు సాగరతీరంలో నిర్వహించిన విన్యాసాల రిహార్సల్స్ శుక్రవారంతో ముగిశాయి. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పాటు ఇప్పటికే విశాఖ తీరానికి చేరిన పలు దేశాలకు చెందిన యుద్ధనౌకలు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. గగనతలం నుంచి పారాట్రూపర్లు నేలపైకి దిగి శత్రువులపై దాడి చేయడం నావికుల్ని ఒక్కసారిగా మోసుకుపోగల పి8ఐ, పలు తరగతులకు చెందిన డిస్ట్రాయిర్లు, ఫ్రిగేట్, కోర్వట్టీలు ఈ విన్యాసాల్లో తమ సత్తాను ప్రదర్శించాయి. శనివారం బీచ్ రోడ్డులో అంతర్జాతీయ కవాతు రిహార్సల్ నిర్వహించనున్నారు. -
ఫ్లీట్ రివ్యూ అంటే
విశాఖపట్నం : దేశంలోని యుద్ధ నౌకల పాటవాన్ని నిర్ధేశిత ప్రాంతంలో సమీక్షించే కార్యక్రమమే ఫ్లీట్ రివ్యూ. దేశ సార్వభౌమత్వవానికి అది ప్రతీకగా నిలుస్తుంది. ఫ్లీట్లోనే కాకుండా దేశ ప్రజలల్లోనూ అత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది. ఆ దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేయడం దీనిలో అంశమైంది. దేశాధ్యక్షుని గౌరవార్థం నిర్వహించే ఈ నౌకా ప్రదర్శనలో ఆయనే సమీక్ష చేస్తారు. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరుపుతున్న దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు ఫ్లీట్‌లో పాల్గొనడంతో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూగా మారింది. భారత్ సైతం విదేశాల్లో జరిగే ఫ్లీట్ రివ్యూల్లో పాల్గొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పలు దేశాల్లోనూ భారత యుద్ధనౌకలు పాల్గొన్నాయి. తొలిసారిగా... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పిఎఫ్ఆర్) తొలిసారిగా దేశాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ గౌరవార్దం 1953 అక్టోబర్ 19న ముంబయ్‌లో జరిగింది. అలాగే నాటి దేశాధ్యక్షులు రాధాకృష్ణన్, వివి గిరి, అహ్వాద్, జ్ఞాని జైల్‌సింగ్, ఆర్.వెంకటరామన్‌ల గౌరవార్దం ముంబయ్‌లో జరిగాయి. కె.ఆర్.నారాయణన్ దేశాధ్యక్షునిగా పదవీకాలంలో 2001 ఫిబ్రవరి 12న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను భారత్ విజయవంతంగా నిర్వహించింది. అనంతరం అబ్దుల్ కలాం హయాంలో 2006 ఫిబ్రవరి 13న తొలిసారిగా పీఎఫ్ఆర్ విశాఖ తీరంలోనే జరిగింది. ప్రతిభాపాటిల్ గౌరవార్థం 2011 డిసెంబర్ 20న ముంబయ్ వేదికగా ఫ్లీట్ రివ్యూ జరిగింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం విశాఖలో ఐఎఫ్ఆర్ జరగనుంది. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల నౌకలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల యుద్ధనౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. పదిసార్లు... స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం భారత్ సైతం పదిసార్లు ఫ్లీట్ రివ్యూ నిర్వహించింది. వాటిలో పదిహేనేళ్ళ క్రితం ముంబయ్ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇదే తొలిసారి భారత్ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం. 29 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశాధ్యక్షుని పదవీకాలంలో ఓసారి మాత్రమే ఈ రివ్యూ జరుగుతుంది. అలా భారత్‌లో పదిసార్లు ప్రెసిడెంట్ రివ్యూగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ తూర్పు తీరంలో నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. విశిష్ట గౌరవం విశాఖలో తొలిసారిగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(2006)లో రక్షణ మంత్రిగా ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారు. విశాఖలోనే తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(2016)కి నేడు ఆయన దేశాధ్యక్షుని హోదాలో హాజరుకానుండడం మరో విశేషం. ఇప్పటి వరకు ఫ్లీట్ రివ్యూల్లో ఇలాంటి గౌరవం ఇదే తొలిసారి. సమీక్షలో... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూల్లో పలు యుద్ధ నౌకలు పాల్గొంటాయి. ఇందులో ఒక నౌకను ప్రెసిడెంట్ యాచ్‌గా పేర్కొంటారు. ఆ నౌకను అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే అన్ని దేశాల జెండాలతో అలంకరిస్తారు. గౌరవ సూచకంగా ఆ నౌక చుట్టూ వలయాకారంలో ఆయా దేశాల నౌకలు ఫార్మేషన్తో ముందుకు కదులుతారయి. లంగర్ వేసిన విదేశీ యుద్ధ నౌకలు పలు ఖండాలకు చెందిన దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరం వైపు కదులుతున్నాయి. కెనడా, యూఎస్ఏ, కొలంబియా, ఆంటిగ్వా, బ్రెజిల్, పెరూ, చిలీ, స్వీడన్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, తునిషియా, సెనెగల్, సౌతాఫ్రికా, మెంజాబిక్, టాంజానియా, కెన్యా, సూడాన్, టర్కీ, ఈజిప్ట్, బెహ్రాన్, సౌదీఅరేబియా, ఓమన్, టుర్కుమెనిస్తాన్, ఇజ్రాయిల్, శ్రీలంక, మాల్దీవులు, మారిషన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, రష్యా, సౌత్‌కొరియా, జపాన్, బ్రనయ్ తదితర దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు సముద్ర, గగనతలం విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. చివరిరోజు టాల్ షిప్స్ తెరచాపలతో సెయిల్ ఇన్ కంపెనీగా విశాఖ నుంచి చెన్నయ్ తీరంవైపు కదలనున్నాయి. ఫ్లీట్ రివ్యూలో ఇదో ప్రత్యేక ఆకర్షణ. భారత్‌లో 18వ శతాబ్దిలోనే భారత ఫ్లీట్ రివ్యూ 18వ శతాబ్దంలోనే జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మరాటా నౌకాదళ శక్తిసామర్ద్యాల ప్రదర్శన మహారాజ్ శివాజీ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్‌లో సెయిల్ ఫర్ వార్ సందర్భంగానూ, యూఎస్ఎలో గ్రేట్ వైట్ ఫ్లీట్ పేరిట తొలిసారిగా జరిగాయి. -
రక్షణ ఛత్రంలో సాగర తీరం
-
రక్షణ ఛత్రంలో సాగర తీరం
► 15 వేల మందితో బందోబస్తు ► 3,4 తేదీల్లో పూర్తిస్థాయి రిహార్సల్స్ ► 7న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ► 1.50 లక్షల మంది సందర్శకులకు పాస్‌లు అల్లిపురం: అంతర్జాతీయ నౌకా ప్రదర్శన (ఐఎఫ్ఆర్) పటిష్ట భద్రతను నగర పోలీస్‌లు కల్పించారు. బుధవారం నుండి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు చెప్పిన దానికి బీచ్‌రోడ్డులో భిన్నమైన వాతావరణ కనిపిస్తుంది. నేవీ అధికారులు బీచ్‌రోడ్డును పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7గంటల వరకు బీచ్రోడ్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. 15వేల మందితో భద్రత.. అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు భద్రతను మూడు ఫేజ్‌లలో ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో 3500 మందితోను. రెండవ ఫేజ్‌లో 7వేల మందితోను మూడవఫేజ్‌లో 15వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ నియంత్రణలకు అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అదనంగా మరికొన్న చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. అదే విధంగా స్నిఫర్ డాగ్స్ టీమ్స్, అర్మిడ్ సెక్యూరిటీ ఫోర్సు, బాంబ్ డిస్పోసబుల్ స్క్వాడ్స్‌తో నిరంతర తనిఖీలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా 300 సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటంతటికీ కంట్రోల్ అండ్ కమాండ్ రూంను వుడా చిల్డ్రన్ థియేటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షా 50వేల మందికి మీసేవ ద్వారా పాస్‌లు.. నౌకా ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు లక్షా 50వేల పాస్‌లు మీ సేవా కేంద్రాల ద్వారా జిల్లా యంత్రాంగం అందజేసింది. సందర్శకులు పాస్‌లతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని రావాలని సూచించారు. వీలైనంత వరకు నగర ప్రజలు 3,4 తేదీలలో జరిగే ఫుల్ డ్రస్ రిహారల్స్ను వినియోగించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. 7వ తేదీన జరిగే అంత ర్జాతీయ నౌకా ప్రదర్శనకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పించాలని కోరారు. పోలీసులు సూచించిన విధంగా నగర ప్రజలు, సందర్శకులు మసలుకొని విశాఖ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని కోరారు. అదే విధంగా పోలీసులతో సహకరించాలని కోరారు. నగరంలో 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు.. బీచ్‌రోడ్‌లో జరిగే నౌకా విన్యాసాలను నగర ప్రజలు వీక్షించేందుకు నగరంలో సుమారు 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఆ రోజు సినిమా థియేటర్లలోను లైవ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కీలకం కానున్న సమాచార వ్యవస్థ.. అంతర్జాతీయ స్థాయి వేడుకలకు నగరం వేదిక కావడంతో భద్రత పరంగా ప్రాధాన్యం చోటుచేసుకుంది. అం దుకు తగిన విధంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఇన్ఫర్మేషన్ విభాగం డీఎస్పీ ఎస్.జ్యోతిర్మయి పర్యవేక్షణలో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఈ ఈవెంట్లో కీలకం కానుంది. ఈ మేరకు వెయ్యి అధునాతన వాకీ టాకీలు (వాయిస్ రెస్పాన్స్ సిస్టంలు) వినియోగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం క్యూనికేషన్ ఏడీజీపీ అంజనా సిన్హా కనుసన్నలలో నడవడం విశేషం. ఇందుకుగాను 14 మంది సిబ్బంది నిరంతరం సీసీ కెమారా ఫుటేజీలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత బీట్ కానిస్టేబుల్స్‌కు అందజేయటం జరుగుతుంది. ట్రాఫిక్ ఏర్పాట్లు.. అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు వచ్చే విఐపీలు, వీవీఐపీల రాక పోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. సైలర్స్ చావులమదుం జంక్షన్ నుంచి పోర్టు రోడ్లులో, కోస్టల్బ్యాటరీ వద్దకు చేరుకుని అక్కడ వారికి నిర్దేశించి స్థలంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు బీచ్‌రోడ్డు పోలీస్ మెస్ నుండి కాళీమాత గుడి, ఎన్టీఆర్ కూడలి వరకు నేవీ వారి స్వాధీనంలో ఉంటుందన్నారు. సందర్శకులు కేవలం పార్క్ హోటల్ నుంచి బీచ్‌లోకి ప్రవేశించి పోలీస్ మెస్ వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. అదే విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు అనుమతిస్తారని తెలిపారు. నేవీ సిబ్బందికి ఏపీఐఐసీ గ్రౌండ్సులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల మెస్ వెన క గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సైలర్స్కు హైవే నుంచి మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి షటిల్ బస్‌లు ద్వారా పోలీస్ మెస్ వరకు వచ్చి వారికి కేటాయించిన స్థలానికి చేరుకోవాలి. జనరల్ పబ్లిక్ పార్క్ హోటల్ వరకు చేరుకుని అక్కడ నుండి బీచ్‌లోకి ఎంటర్ కావాలి. ఆర్టీసీ బస్‌లు లాసన్స్‌బే కాలనీ కామత్ హోటల్ వరకు అనుమతిస్తారు. ఆర్టీసీ షటిల్ బస్సు రూటు 1. ఏఎస్ రాజా నుంచి కామత్ హోటల్ వరకు 2. ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి మానసిక ఆస్పత్రి 3. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి న్యూ కేర్ ఆస్పత్రి 4. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ 2/4 వీలర్ వాహనాలు 1. ఈస్ట్‌పాయింట్ కాలనీ రోడ్ 2. ఏయూ కేంపస్ ప్రవేశం 3. ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్టల్ మైదానం ప్రవేశం -
2016లో ఫ్లీట్ రివ్యూ
విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 60 దేశాల నౌకాదళాల యుద్ధనౌకల సమీక్షకు విశాఖ సన్నద్ధమవుతోందని తూర్పు నావికాదళ చీఫ్ సతీష్‌సోనీ చెప్పా రు. భారత్ స్వాతంత్య్రం అనంతరం ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఫ్లీట్ రివ్యూ జరగ్గా.. వచ్చే ఏడాది మరోసారి నిర్వహించనుందని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన సోమవారం నావల్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనాన్ని స్వీకరించి కవాతును పరిశీలించారు. 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షకు విశాఖ వేదిక కావడం తూర్పు నావికా దళానికే కాకుండా భారత నావికాదళ చరిత్రలోనే మరో మైలురాయి అని సతీష్‌సోనీ చెప్పారు. తీరరక్షణతోపాటు తూర్పుతీర దేశాలకు సహాయసహాకారాలు అందించడంలోనూ నావికాదళం ముందు ఉందన్నారు. ప్రకృతి విపత్తులవేళ పలు సేవలు అందించిందని గుర్తు చేశారు. ఈఎన్సీకీ చెందిన ఫ్లాగ్ ఆఫీసర్లు, నావికాదళ అధికారులు పాల్గొన్నారు.