టోక్యో: జపాన్ను భూకంపం వణికించింది. ఈశాన్య జపాన్లో గురువారం తెల్లవారుజామున 3.25 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. షింజునాయ్కి 51 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అలాగే ప్రాణ ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం లేదు. కాగా భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈశాన్య జపాన్లో భూకంపం
Published Thu, Jan 14 2016 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement