నడపడం ఇష్టంలేదని విమానం గాల్లో వదిలి.. | student pilot fought with instructor, crashed plane | Sakshi
Sakshi News home page

నడపడం ఇష్టంలేదని విమానం గాల్లో వదిలి..

Published Wed, Mar 29 2017 9:12 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

నడపడం ఇష్టంలేదని విమానం గాల్లో వదిలి.. - Sakshi

నడపడం ఇష్టంలేదని విమానం గాల్లో వదిలి..

న్యూయార్క్‌: గత ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్‌లో చోటుచేసుకున్న చిన్న విమానం కూలిపోయిన ఘటన గురించి షాకింగ్‌ విషయాలు తెలిశాయి. విమానం నడపడం నేర్చుకుంటున్న విద్యార్థి ఇన్‌స్ట్రక్టర్‌తో గొడవపడటం వల్లే విమానం కూలిపోయిందని తెలిసింది. అంతేకాదు.. అసలు పైలట్‌ కావడం ఆ విద్యార్థికి ఏ మాత్రం ఇష్టం లేదంట. అతడి తల్లి బలవంతం చేయడం వల్లే తాను అలా చేయాల్సి వచ్చిందని తరుచూ అంటుండేవాడని తెలిసింది. ఆ చిరాకుతోనే దాదాపు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా విమానం నడిపి కూలిపోయేలా చేశాడని తెలిసింది.

అమెరికాలో గత అక్టోబర్‌లో ఓ చిన్నవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఫెరాస్‌ ప్రెయితెక్‌ అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విమానంలోనే ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్న అరియాన్‌ ప్రెవల్లా గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా తనకు విమానం నడపడం ఏమాత్రం ఇష్టం లేదని గాల్లోనే దాన్ని వదిలేసి ఇన్‌స్ట్రక్టర్‌తో గొడవపడ్డాడని తెలిసింది. తన తల్లి వల్లే విమానం నడపాల్సి వస్తుందని మండిపడుతూ ఇన్‌స్ట్రక్టర్‌పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలోనే విమానం కాస్త కూలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement