small plane
-
దడ పుట్టించిన చేజింగ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ చిన్న విమానాన్ని జెట్ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ శబ్ధం వాషింగ్టన్ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్టన్ నుంచి బయలుదేరింది. లాంగ్ ఐల్యాండ్‌లోని మెక్ ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మీదుగా, సరాసరి వాషింగ్టన్ డీసీ వైపుగా వచ్చింది. దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్–16 జెట్ విమానాన్ని పంపారు. అది సోనిక్ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్‌తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్ దృష్టిలో పడేందుకు ఫైటర్ జెట్ ఎఫ్–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఫ్లోరిడాకు చెందిన ఎన్కోర్ మోటార్స్ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్ రంపెల్ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్‌తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ హాంప్టన్‌కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్జెట్ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు. -
నడపడం ఇష్టంలేదని విమానం గాల్లో వదిలి..
న్యూయార్క్: గత ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్‌లో చోటుచేసుకున్న చిన్న విమానం కూలిపోయిన ఘటన గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. విమానం నడపడం నేర్చుకుంటున్న విద్యార్థి ఇన్‌స్ట్రక్టర్‌తో గొడవపడటం వల్లే విమానం కూలిపోయిందని తెలిసింది. అంతేకాదు.. అసలు పైలట్ కావడం ఆ విద్యార్థికి ఏ మాత్రం ఇష్టం లేదంట. అతడి తల్లి బలవంతం చేయడం వల్లే తాను అలా చేయాల్సి వచ్చిందని తరుచూ అంటుండేవాడని తెలిసింది. ఆ చిరాకుతోనే దాదాపు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా విమానం నడిపి కూలిపోయేలా చేశాడని తెలిసింది. అమెరికాలో గత అక్టోబర్‌లో ఓ చిన్నవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఫెరాస్ ప్రెయితెక్ అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విమానంలోనే ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్న అరియాన్ ప్రెవల్లా గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా తనకు విమానం నడపడం ఏమాత్రం ఇష్టం లేదని గాల్లోనే దాన్ని వదిలేసి ఇన్‌స్ట్రక్టర్‌తో గొడవపడ్డాడని తెలిసింది. తన తల్లి వల్లే విమానం నడపాల్సి వస్తుందని మండిపడుతూ ఇన్‌స్ట్రక్టర్‌పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలోనే విమానం కాస్త కూలిపోయింది. -
కారు పార్కింగ్‌లో కూలిన చిన్న విమానం
-
ఇంటిపై కూలిన మినీ విమానం
ప్లోరిడా: టేకాఫ్, ల్యాండింగ్‌లు ప్రాక్టిస్ చేయడానికి ఉపయోగించిన ఓ మినీ ప్లేన్ కూలిపోయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని పొంపనో బీచ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పంపనో బీచ్‌లోని ఎయిర్ పార్క్ నుంచి నింగికెగిరిన కొద్దిసేపటికే బీఈ-76 మినీ విమానం ఓ ఇంటిపై కూలిపోయింది. ఆ విమానాన్నిపైలెట్ టేకాఫ్, ల్యాండింగ్ చేయడం నేర్చుకోవడానికి ఉపయోగించాడని విమానయాన సిబ్బంది తెలిపారు. ప్లేన్ క్రాష్ అయిన సమయంలో మంటలు చెలరేగడంతో ఇంటికి కూడా నిప్పు అంటుకుంది. క్షతగాత్రులలో ఓ యువతికూడా ఉంది. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో భూమిపై ఉన్న వారు ఎవరికి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. -
కూలిన విమానం.. ఐదుగురు మృతి
బగోటా: కొలంబియా రాజధాని బగోటాలో చిన్న విమానం కూలిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పన్నెండు మంది గాయాలపాలయ్యారు. రాజధానిలోని ఈ డోరాడో విమానాశ్రయం నుంచి టేకింగ్ తీసుకున్న కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాణిజ్య సముదాయాలకు సమీపంలో ఈ విమానం కూలిపోవడంతో అక్కడే ఉన్న ఓ బేకరికి మంటలు అంటుకున్నాయి. విమానంలోని పైలెట్ ముగ్గురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారని, బేకరిలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయాడని విమానయాన అధికారులు తెలిపారు. గాయపడిన వారంతా కూడా బేకరీకి సంబంధించినవారే ఉన్నారు. వారిలో ఓ పన్నేండేళ్ల బాలిక కూడా ఉంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన మూడు నెలల్లో బగోటాలో విమాన ప్రమాదం చోటు చేసుకోవడం ఇది మూడోసారి.