ప్లోరిడా: టేకాఫ్, ల్యాండింగ్లు ప్రాక్టిస్ చేయడానికి ఉపయోగించిన ఓ మినీ ప్లేన్ కూలిపోయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని పొంపనో బీచ్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పంపనో బీచ్లోని ఎయిర్ పార్క్ నుంచి నింగికెగిరిన కొద్దిసేపటికే బీఈ-76 మినీ విమానం ఓ ఇంటిపై కూలిపోయింది. ఆ విమానాన్నిపైలెట్ టేకాఫ్, ల్యాండింగ్ చేయడం నేర్చుకోవడానికి ఉపయోగించాడని విమానయాన సిబ్బంది తెలిపారు.
ప్లేన్ క్రాష్ అయిన సమయంలో మంటలు చెలరేగడంతో ఇంటికి కూడా నిప్పు అంటుకుంది. క్షతగాత్రులలో ఓ యువతికూడా ఉంది. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో భూమిపై ఉన్న వారు ఎవరికి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
ఇంటిపై కూలిన మినీ విమానం
Published Tue, Apr 26 2016 1:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement