తైవాన్ : ఓ తైవాన్ తాత అద్భుతం సృష్టించాడు. ఒకేసారి 15 మొబైల్స్‌లో వివాదస్పద పొకెమెన్ గో గేమ్ ఆడుతూ.. ఔరా అనిపించాడు. ఈ గేమ్ ఆడటం కోసం ఆ తాత.. ఏకంగా ఓ ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. 15 మొబైల్స్‌ను పెట్టుకునే విధంగా సైకిల్ హ్యాండిల్ తయారు చేసి.. ఆ మొబైల్స్‌కు బ్యాటరీ బ్యాకప్ కూడా సిద్దంగా ఉంచుకున్నాడు. ఇలా సైకిల్‌పై 15 మొబైల్స్‌తో పొకోమెన్ గేమ్ ఆడుతూ అందరిని అబ్బూర పడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పెన్షనర్ అయిన ఆ తైవాన్ తాత పేరు సాన్ యూయాన్. వయస్సు 70 ఏళ్లు.
మొబైల్ ఉపయోగిస్తున్నప్పటి నుంచి ఈ గేమ్ ఆడుతున్నాని, ఒక్క ఫోన్‌తో మొదలైన తన ఆట.. నెల తిరిగేసరికి మూడు, ఆ తరువాత ఆరు, తొమ్మిది 15కు చేరిందని చెప్పుకొచ్చాడు ఈ తైవాన్ తాత. తన మనవడు ఈ గేమ్‌ను తనకు చూపించాడని ఈ క్రెడిట్ అంతా అతనిదేనని తెలిపాడు. ప్రస్తుత ఈ తాతా పొకెమెన్ గో తాతాగా ఫేమస్ అయ్యాడు. ఈ మొబైల్స్, పరికరాల కోసం 4800 యూఎస్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఇక ఈ తాత శక్తి మాములుది కాదని, అతని స్నేహితులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment