తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ (TeNA) కనెక్టికట్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండో వార్షికోత్సవాన్ని హార్ట్ ఫోర్డ్ సమీపంలోని వెర్నాన్ నగరంలో గల వెర్నాన్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 350 మంది హాజరై విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్, కవి, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు చిన్నారులు, పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తేన మహిళా కమిటీ సభ్యులు తెలంగాణలోని 10 జిల్లాల గురించి వివరిస్తూ ప్రదర్శించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తేన అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ మారోజు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమర్ కర్మిల్ల, కనెక్టికట్ చాప్టర్ అధ్యక్షుడు విక్రం రౌతు వేదికను అలంకరించి సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎంపీ వినోద్ వివరించారు. తెలంగాణా ఎన్ఆర్ఐ అసోసియేషన్ అమెరికాలోను, తెలంగాణలోను చేసే పలు కార్యక్రమాల గురించి వెంకట్, అమర్, విక్రం వివరించి అతిథులను సత్కరించారు.
తర్వాత టాలీవుడ్ గాయకుడు రేవంత్, స్థానిక గాయని మానస నిర్వహించిన మ్యూజికల్ షో ప్రేక్షకులను రంజింపజేసింది. సావి క్యాతం, స్వప్న జూపల్లిల యాంకరింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని తేన సభ్యులు సునీల్ తరాల, ధర్మారావు ఎరబెల్లి, సతీష్ అన్నమనేని, కరుణాకర్ సజ్జన, సతీష్ గండ్ర, రాకేశ్ వంగల, ప్రసాద్ కడారి, కమలాకర్ స్వామి, కృష్ణ కుంభం, సావి క్యాతం, స్వప్న జూపల్లి, విక్రం రౌతు, హరి రావు నిర్వహించారు.
తేన ఆధ్వర్యంలో కనెక్టికట్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
Published Tue, Jun 14 2016 3:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement