పరిపాలనలో పది సూత్రాలు
ట్రంప్ టీమ్ కార్యాచరణ ప్రణాళిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అప్పుడే పరిపాలనా కార్యాచరణపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ట్రంప్ బృందం సన్నద్ధమవుతోంది. అమెరికా వలస వ్యవస్థలో సమగ్రతను పాదుగొల్పేలా 10 సూత్రాల ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ట్రంప్ ట్రాన్సిషన్ బృందం వెల్లడించింది. వలస సంస్కరణలు తీసుకురావడంతో పాటు మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, కొన్ని దేశాల పౌరులకు వీసాల నిరాకణ వంటివి ఇందులో ఉంటాయంది.
కాగా, ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నారుు. ట్రంప్ ’మా అధ్యక్షుడు కాదు’ అన్న నినాదం సోషల్ మీడియాలోనూ, నిరసనల్లో హోరెత్తుతోంది. నిరసన కారులను మీడియా రెచ్చగొడుతోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ భార్య, త్వరలో ఫస్ట్ లేడీ కానున్న మెలానియా ట్రంప్‌కు మిషెల్ ఒబామా వైట్‌హౌస్‌లో స్వాగతం పలికారు. వైట్‌హౌస్ మొత్తం తిప్పి స్వయంగా చూపించారు.