
ఆర్మీ స్కూల్ పై తాలిబన్ల దాడి, 126 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. పెషావర్‌లోని ఓ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోకి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు వేసుకుని స్కూల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... టీచర్లు, విద్యార్థులను బంధించి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 126 మంది విద్యార్థులు మరణించినట్టు సమాచారం.
కాగా స్కూల్‌ను చుట్టుముట్టిన సైన్యంపై ఉగ్రవాదులు పాఠశాల లోపలి నుంచే కాల్పులు జరుపుతున్నారు. ఇక కాల్పులకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. మొత్తం1 500 మంది విద్యార్ధులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తుంది. కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఉగ్రవాదుల దాడిని పాకిస్తాన్ ప్రధాని తీవ్రంగా ఖండించారు.