ఆ లైసెన్స్‌లతో దేశాలు చుట్టేయెచ్చు!
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు లేని డ్రైవింగ్ లైసిన్స్ లు కలిగిన దేశాలుగా యూకే, ఫ్రాన్స్ తొలిస్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాల్లో వాహనాదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇతర దేశాల్లో చెల్లుబాటు అవుతాయట. ఇతరదేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆంక్షలు ఉండవట. ఆ దేశ వాహనాదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లతో ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రయాణించడానికి క్షణాల్లో అనుమతి లభిస్తుందంట. ఇతరదేశాల్లో పోలిస్తే.. యూకే, ప్రాన్స్ దేశాల డ్రైవిగ్ లైసెన్స్‌లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. కొన్ని దేశాల్లో మాత్రం ఈ దేశాల డ్రైవర్లకు లైసెన్స్‌లు మార్చుకోవడానికి అదనపు పరీక్షలు అవసరం లేదు కానీ, మరొకొన్ని దేశాల్లో మాత్రం కొత్త లైసెన్స్‌లు పొందాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో నెగ్గాల్సిందే.
ప్రపంచ పటంలోని 22 దేశాలతో కలిపితే ఫ్రాన్స్, యూకే జంటగా ముందంజలో ఉన్నాయి. ఈ దేశాల డ్రైవింగ్ లైసెన్స్‌లకు మాత్రం కొన్ని దేశాల్లో మాత్రం ఆంక్షలు వర్తిస్తాయి. వీటితో పాటు అమెరికా ఏడో స్థానంలో ఉండగా, రష్యా దేశానికి మాత్రం ప్రతి దేశంలోనూ డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆంక్షలు వర్తిస్తాయట. చైనా దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆ దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కానీ ప్రస్తుతం 21 దేశాల్లో చైనా డ్రైవింగ్ లైసెన్స్‌లు చెల్లుబాటు అవుతున్నాయి.