వీధుల్లోంచి.. విశ్వసుందరి వేదికపైకి! | The Tuk Tuk Dress, From Thailand's streets to Miss Universe | Sakshi
Sakshi News home page

వీధుల్లోంచి.. విశ్వసుందరి వేదికపైకి!

Published Sun, Nov 29 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

వీధుల్లోంచి.. విశ్వసుందరి వేదికపైకి!

వీధుల్లోంచి.. విశ్వసుందరి వేదికపైకి!

మన దగ్గర మూడు చక్రాల ఆటో లాటిందే.. థాయ్‌లాండ్‌లోని టక్‌-టక్‌ వాహనం. థాయ్‌లాండ్‌కు ప్రతీకగా గుర్తింపు పొందిన ఈ వాహనం ఆకృతిలో రూపొందించిన దుస్తులు ఇప్పుడు విశ్వసుందరి పోటీల వేదికపై తళుక్కుమననున్నాయి. మిస్‌ యూనివర్స్ పోటీల్లో థాయ్‌లాండ్ తరఫున పాల్గొంటున్న అనిపోర్న్ చెలెర్మ్‌బురానావాంగ్‌ ఈ టక్‌-టక్‌ నమూనా దుస్తులను ధరించనున్నట్టు ప్రకటించింది. లైట్‌వెయిట్‌ ప్లాస్టిక్‌తో రూపొందిన ఈ డ్రెస్ అక్షరాల ఏడు కిలోల బరువు ఉంటుంది.

ఫ్లాషింగ్ హెడ్‌లైట్‌, హ్యాండిల్ బార్‌తో వినూత్నంగా ఉండే ఈ దుస్తులతో విశ్వసుందరి పోటీల్లో అందరి దృష్టి తనవైపు తిప్పుకోవాలని ఈ భామ భావిస్తున్నది. టక్‌-టక్ వాహనం స్ఫూర్తితో డిజైనర్ హిరన్‌క్రిట్ పత్తరబోరిబూంకుల్ ఈ దుస్తులను రూపొందించాడు. వేదికపై ధరించి క్యాట్‌వాక్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆటోను పోలిన టక్‌-టక్‌ డ్రెస్‌ను సిద్ధం చేశాడు. డిసెంబర్ 20 నుంచి లాస్‌వేగాస్‌లో మిస్‌ యూనివర్స్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్‌లో టక్‌-టక్ దుస్తులను వేసుకోనున్నట్టు అనిపోర్న్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement