Miss Universe competition
-
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్‌తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
Miss Universe 2023 : అదరహో అనిపించిన సుందరీమణులు వీళ్లు (ఫొటోలు)
-
అసహ్యంగా మాట్లాడారు.. కష్టంగా అనిపించింది
తాజా విశ్వ సుందరి పోటీలపై సంచలన ఆరోపణలు చేసింది మిస్ రష్యా అన్నా లిన్నికోవా. ఆరోగ్యవంతమైన పోటీల వేదికగా పేరున్న మిస్ యూనివర్స్ పోటీల్లో.. తాను దారుణమైన అనుభవాల్ని ఎదుర్కొన్నారని పేర్కొన్నారామె. అమెరికా, ఉక్రెయిన్ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న ఆమె.. తోటి పోటీదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తాను ఎదుర్కొవాల్సి వచ్చిందని తాజాగా ఆరోపించారు. మిస్ యూనివర్స్ 2023 పోటీలు అమెరికాలో జనవరి 15వ తేదీతో ముగిశాయి. అయితే.. పోటీలో తనను చిన్నచూపు చూశారని రష్యన్ అందాల సుందరి ఆరోపిస్తోంది. తన దేశ మీడియా సంస్థ ఈవెనింగ్ మాస్కోకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తెలిసిన వాళ్లే నన్ను దూరం పెట్టారు. పోటీలు మొదలయినప్పటి నుంచే నన్ను అవమానిస్తూ.. బెదిరిస్తూ ఉక్రెయిన్ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేశారు. చాలా అసహ్యంగా మాట్లాడారు. ప్రత్యేకించి.. చాలాకాలంగా పరిచయం ఉన్నవాళ్లు కూడా నాపై నెగెటివ్ కామెంట్లు చేశారు. అది చాలా కష్టంగా అనిపించిందని పేర్కొన్నారామె. రష్యా పౌరురాలిని కావడంతో కొందరైతే.. దూరంగా ఉన్నారని, ఇష్టానుసారం మాట్లాడారని పేర్కొన్నారామె. ముఖ్యంగా ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయిలైతే తనపై మండిపడ్డరాని పేర్కొందామె. అయితే.. అలాంటి సమయంలో వెనిజులా భామ అమండా డుడామెల్ తనతో ఆప్యాయంగా ఉంటూ.. పోటీల్లో అండగా నిలిచే యత్నం చేసిందని, బహుశా ఆ మంచితనానికే ఆమె పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఉండొచ్చని అన్నా అభిప్రాయపడింది. ఉక్రెయిన్ సుందరి విక్టోరియా అపనాసెంకో గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారనంగానే ఆమె తనతో మాట్లాడకపోయి ఉండొచ్చని, అది ఎంతో బాధించిందని మిస్ రష్యా అందాల సుందరి అన్నా లిన్నికోవా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నాకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. -
మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
-
మిస్ యూనివర్స్‌గా భారత యువతి
సాక్షి, న్యూఢిల్లీ: 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్‌గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 చదవండి: దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్ పాప్ సింగర్.. మిలీనియం గర్ల్ హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్. -
మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?
ఎంత సన్నగా ఉందో! గాలొస్తే ఎగిరిపోతుంది!! అని హేళన చేసేవారామెను. ఆ మాటలు విన్న ప్రతిసారి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యేది. స్కూల్లో తోటివిద్యార్థులు పదేపదే తనపై వేసే జోకులను మౌనంగా భరిస్తూ, సిగ్గుతో తలదించుకుని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్ సంధు. హర్నాజ్ ఫీల్ అయిన ప్రతిసారి కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్‌లో రాణిస్తూ, సినిమాల్లో నటిస్తూ ఏకంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది. నేడు (డిసెంబర్ 12న) ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో డెబ్భయ్యవ ‘విశ్వసుందరి’ (మిస్ యూనివర్స్) – 2021 పోటీలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఇండియాకు రెండుసార్లు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియాలు పోటీపడ్డారు. కానీ 1994లో సుస్మితాసేన్, 2000 లో లారా దత్తాలు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో లారాదత్త ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం తెచ్చింది. ఆ తరువాత ఇప్పటిదాకా మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ రాలేదు. అయితే లారాదత్త కిరీటం గెలుచుకున్న ఏడాదే జన్మించిన ‘మిలీనియం గర్ల్’ హర్నాజ్ కౌర్ సంధు.. ప్రస్తుతం భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు బరిలో నిలిచింది. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకునేందుకు ఆరాటపడుతుంటే... భారతీయులందరూ మిలీనియం గర్ల్ మిస్ యూనివర్స్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మిలీనియం గర్ల్ 21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది ‘మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా’ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రెండు టైటిల్స్ గెలుచుకున్న తరువాత...2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్–12 జాబితాలో నిలిచింది. ఇదే ఏడాది “మిస్ ఇండియా పంజాబ్‌గా’కూడా నిలిచింది. మంచి పాపులారిటీ రావడంతో ద ల్యాండర్స్ రూపొందించిన మ్యూజిక్ వీడియో “తార్తల్లి’లో నటించింది. ఆ తరువాత అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్కిన్, మిస్ బీచ్ బాడీ, మిస్ బ్యూటీఫుల్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ ఫోటోజెనిక్, మిస్ టాలెంటెడ్‌గా నిలిచింది. ఈ కిరీటం ద్వారానే ‘మిస్ యూనివర్స్–2021కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది హర్నాజ్. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెబుతోన్న హర్నాజ్ కిరీటాన్ని సాధించాలని ఆశిద్దాం. -
ఇజ్రాయెల్‌లో ప్రపంచ సుందరి పోటీలు
న్యూయార్క్: ఈ ఏడాది ప్రపంచ సుందరి పోటీలు ఇజ్రాయెల్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్నది 70వ ఎడిషన్ పోటీ కాగా, అది డిసెంబర్లో ఇజ్రాయెల్‌లోని రిసార్ట్ నగరం ఎలియాత్లో జరుగుతుందని మిస్ యూనివర్స్ సంస్థ మంగళవారం వెల్లడించింది. మూడు గంటల పాటు సాగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ సుందరిగా ఉన్న మెక్సికో దేశస్తురాలు ఆండ్రియా మెజా కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని బహూకరిస్తారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలని తద్వారా మిస్ యూనివర్స్ 70వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కుతుం దని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆండ్రియా మెజా సైతం వ్యాక్సినేషన్ చేయిం చుకోవాలంటూ అప్పట్లో ప్రచారం చేశారు. -
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరీ
-
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరీ
బ్యాంకాక్ : ఈ ఏడాది విశ్వ సుందరిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన క్యాట్రియోనో ఎలైసా గ్రే ఎంపికైంది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయ నిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన టామేరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా మిస్ వెనిజులా స్తేఫనీ గుత్రేజ్ నిలిచింది. మొత్తం 94 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన నెహల్ చుడాసమ టాప్ 20 లో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది. Introducing your newly crowned #MissUniverse 2018 @catrionaelisa. 👑 pic.twitter.com/SXGIDw2nlm — Miss Universe (@MissUniverse) December 17, 2018 ఇక మిస్ యునివర్స్ 2017గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరీ డెమి లీ తన చేతుల మీదుగా కిరిటాన్ని క్యాట్రియానోకు తొడిగింది. ఫైన్ల్ క్వశ్చన్ రౌండలో క్యాట్రియానోకు ‘జీవితంలో నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన గుణపాఠం ఏమిటి? మిస్ యూనివర్సీగా దాన్నేలా చూస్తావు?’ అనే ప్రశ్నఎదురైంది. దానికి ఆమె ‘మనిలాలోని అనేక మురికివాడల్లో నేను పనిచేశాను. అక్కడి వారు చాలా పేదవారు. అందాన్ని చిన్నపిల్లల ముఖంలోని చూడాలని నాకు నేను చెప్పుకుంటాను. మిస్యూనివర్సీగా వారికి నావంతుగా ఎదైనా సాయం చేస్తాను. వారికి మంచి చెడులను బోధించడం కూడా నాకు గొప్పవిషయమే. అలా చిన్నపిల్లల ముఖాల్లో చిరు నవ్వును చూడటమే నాకుక కావాలి’ అని సమాధానం ఇచ్చింది. కళల పట్ల అత్యంత ప్రేమ కనబర్చే క్యాట్రియానో మ్యూజిక్ థియరీలో మాస్టర్ సర్టిఫికేట్ పొందింది. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ మానవతావాదిగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. తొలి రన్నరప్‌గా నిలిచిన టామేరిన్ గ్రీన్ వైద్య విద్యార్థి కాగా.. సెకండ్ రన్నరప్ స్తేఫనీ న్యాయవిద్యార్థి. Miss Universe 2018 is... PHILIPPINES! pic.twitter.com/r2BkN8JpXh — Miss Universe (@MissUniverse) December 17, 2018 చదవండి: మిస్ వరల్డ్‌గా మెక్సికన్ యువతి -
వీధుల్లోంచి.. విశ్వసుందరి వేదికపైకి!
మన దగ్గర మూడు చక్రాల ఆటో లాటిందే.. థాయ్‌లాండ్‌లోని టక్-టక్ వాహనం. థాయ్‌లాండ్‌కు ప్రతీకగా గుర్తింపు పొందిన ఈ వాహనం ఆకృతిలో రూపొందించిన దుస్తులు ఇప్పుడు విశ్వసుందరి పోటీల వేదికపై తళుక్కుమననున్నాయి. మిస్ యూనివర్స్ పోటీల్లో థాయ్‌లాండ్ తరఫున పాల్గొంటున్న అనిపోర్న్ చెలెర్మ్బురానావాంగ్ ఈ టక్-టక్ నమూనా దుస్తులను ధరించనున్నట్టు ప్రకటించింది. లైట్‌వెయిట్ ప్లాస్టిక్‌తో రూపొందిన ఈ డ్రెస్ అక్షరాల ఏడు కిలోల బరువు ఉంటుంది. ఫ్లాషింగ్ హెడ్‌లైట్, హ్యాండిల్ బార్‌తో వినూత్నంగా ఉండే ఈ దుస్తులతో విశ్వసుందరి పోటీల్లో అందరి దృష్టి తనవైపు తిప్పుకోవాలని ఈ భామ భావిస్తున్నది. టక్-టక్ వాహనం స్ఫూర్తితో డిజైనర్ హిరన్క్రిట్ పత్తరబోరిబూంకుల్ ఈ దుస్తులను రూపొందించాడు. వేదికపై ధరించి క్యాట్‌వాక్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆటోను పోలిన టక్-టక్ డ్రెస్‌ను సిద్ధం చేశాడు. డిసెంబర్ 20 నుంచి లాస్వేగాస్లో మిస్ యూనివర్స్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో టక్-టక్ దుస్తులను వేసుకోనున్నట్టు అనిపోర్న్ తెలిపింది.