బీజింగ్ : పర్యాటక వసతులను మెరుగుపర్చడానికి చైనా టాయిలెట్ల విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తోంది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా అన్ని టాయిలెట్లను ఆధునీకరించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వసతుల అభివృద్ధిలో కొత్త టాయిలెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు.
ప్రపంచ పర్యాటక సంస్థ గణాంకాల ప్రకారం అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన నాలుగు దేశాల్లో చైనాకు చోటు దక్కింది. ఈ దేశంలో గత ఏడాది 5.93 కోట్ల మంది పర్యటించారు. వివిధ పర్యాటక ప్రదేశాల్లో ఈ అక్టోబరు నాటికి చైనా 68 వేల టాయిలెట్లను నిర్మించింది. 2020 వరకు మరో 64 వేల టాయిలెట్లను ఆధునీకరించాలని సంకల్పించారు. టాయిలెట్ విప్లవం పర్యాటక ప్రాంతాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తోందని చైనా మీడియా పేర్కొంది. మరుగుదొడ్లతోపాటు రోడ్ల వంటి ఇతర సదుపాయాలనూ విస్తరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment