దేశ రక్షణ ట్రంప్‌ ఎవరికిస్తున్నారంటే.. | Trump taps retired general Kelly for Homeland Security chief | Sakshi
Sakshi News home page

దేశ రక్షణ ట్రంప్‌ ఎవరికిస్తున్నారంటే..

Published Mon, Dec 12 2016 7:52 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

దేశ రక్షణ ట్రంప్‌ ఎవరికిస్తున్నారంటే.. - Sakshi

దేశ రక్షణ ట్రంప్‌ ఎవరికిస్తున్నారంటే..

న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రభుత్వంలోకి మరో మాజీ ఆర్మీ అధికారిని తీసుకోనున్నారు. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. గతంలో సైనిక విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జనరల్‌ జాన్‌కెల్లీని దేశీయ రక్షణ వ్యవహారాల శాఖ అధిపతిగా తీసుకోనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు తన ప్రభుత్వంలోకి ముగ్గురు మాజీ సైనికాధికారులను తీసుకున్నట్లవుతుంది.

‘జాన్‌ కెల్లీకి అపార అనుభవం ఉంది. అంతర్గత ఉగ్రవాదాన్ని ఆయన సమర్థంగా అంచనా వేయగలరు. ఆయన మంచి కమిట్‌మెంట్‌తో పోరాటం చేసే వ్యక్తి. అందుకే ఆయన మాత్రమే ఈ విధులు నిర్వహించగల సమర్థుడని భావిస్తున్నాను. మన సరిహద్దులు కాపాడేందుకు, మనం ఉన్నపలంగా అమలుచేయాల్సిన అక్రమ వలసలు నివారణ వంటివాటికి కెల్లీ సరైనవారు. నిఘా వర్గాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల మధ్య వారధిలా పనిచేస్తారు’  అని ట్రంప్‌ ఈ సందర్భంగా తెలిపారు.

దీనిపై కెల్లీ స్పందిస్తూ ట్రంప్‌ తనకు ఆ అవకాశం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు, తిరిగి అమెరికా సరిహద్దుల్లో సార్వభౌమాత్వాన్ని కాపాడేందుకు అమెరికా ప్రజలు ఓటేశారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement