ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ వివాదంతో.. ఇస్లామాబాద్-వాషింగ్టన్ మధ్య దూరం పెరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆసిఫ్ ఖాజా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతంఇరు దేశాల మధ్య విశ్వసనీయత లేదు.. అయితే.. దూరాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం..అని ఆసిఫ్ ఖాజా మీడియాకు తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌తో సమావేశం అనంతరం ఆసిఫ్ ఖాజా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా కాదని తెలిపారు.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా ఉన్నతాధికారు ఒకరు పాక్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయాన్ని.. రెక్స్ టిల్లర్‌సన్ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాక పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల ఏరివేతకు ప్రభుత్వం మరింత తీవ్రంగా కృషి చేయాలని టిల్లర్‌సన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ కాజా వీటిపై వివరణ ఇస్తూ.. ఉగ్రవాదులు 40 ఆఫ్ఘన్ భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నారని ఆయన అన్నారు.
,
Comments
Please login to add a commentAdd a comment