సిరియాలో సైన్యం దాడుల్లో 60 మంది మృతి | US air strike in Syria kills nearly 60 civilians 'mistaken for Isil fighters' | Sakshi
Sakshi News home page

సిరియాలో సైన్యం దాడుల్లో 60 మంది మృతి

Published Fri, Jul 22 2016 11:01 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

US air strike in Syria kills nearly 60 civilians 'mistaken for Isil fighters'

బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాల్లో గురువారం అమెరికా సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 15 మంది చిన్నారులుసహా 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని డమాస్కస్‌కు తూర్పున ఉన్న గౌట ప్రాంతంలో దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారని ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ తెలిపింది. డ్యూమాలోనూ దాడులు కొనసాగాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ తెలిపారు.

అలెప్పో సమీపంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులుసహా 15 మంది చనిపోయారు. అలెప్పో సిటీ గత రెండు వారాలుగా సైన్యం ముట్టడిలో ఉంది. ఇడ్లిబ్‌కు నైరుతి దిశలో ఉన్న వేర్వేరు ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో మొత్తం 30 మంది మరణించారు. 2011 మార్చిలో దేశంలో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2,80,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు సగం దేశజనాభా స్వస్థలాలను వదిలివెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement