బద్దలైన అగ్నిపర్వతం
జకార్తా: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , గాలులు విస్తరిస్తున్నాయని ఇండోనేషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో సమీపంలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
2,475 మీటర్లు విస్తరించి ఉన్నఈ మౌంట్ సినాబంగ్ చుట్టూ సుమారు 120 అగ్నిపర్వతాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ అగ్ని పర్వతం 2013, 14 సంవత్సరాల్లో తరచుగా బద్దలైంది . ఈ సంబందర్భంగా పెద్ద ఎత్తున ఎగజిమ్మిన లావా భయోత్పాతం సృష్టించింది. 15మంది పౌరులు మరణించగా, ముప్పయివేలమందిని అక్కడినుంచి తరలించారు. తాజా పరిణామాలతో నేపథ్యంలో చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' పైన వుంది. ఇక్కడ భూమి పొరలు ఒకదానితోమరొకటి సంఘర్షించడంతో అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు సంభవించడంలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి.