ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద! | Fishermen Discover Island Of Gold In Indonesia This Treasure Worth Is Billions | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

Published Fri, Oct 29 2021 4:41 PM | Last Updated on Fri, Oct 29 2021 6:23 PM

Fishermen Discover Island Of Gold In Indonesia This Treasure Worth Is Billions - Sakshi

గుప్త నిధుల వేట గురించి జానపద కథల్లో చదివి ఉంటారు. కానీ చాలా అరుదుగా మత్రమే నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అచ్చం కథల్లో మాదిరి.. ఇండోనేషియా మత్స్యకారులకు తాజాగా ఓ వెలకట్టలేని నిధి దొరికింది... ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. 

ఐదేళ్లగా వేట.. ఎట్టకేలకు దొరికిన నిధి..
ఇండోనేషియా ద్వీపమైన సుమత్రాలోని పాలెంబాంగ్ సమీపంలో ఉన్న మూసీ నదిలో మొసళ్లు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. ఇటువంటి ప్రమాదకర నదిలో గత ఐదేళ్లుగా బంగారం ద్వీపం కోసం వెదుకుతున్నారు అక్కడి మత్సకారులు. ఈ సుమత్రా దీవికి బంగారం ద్వీపం అనేపేరు కూడా ఉంది. అక్కడి ఇతిహాసాలు ఇటువంటి ఒక గుప్త నిధికి సంబంధించిన దీవి ఉన్నట్లు చెబుతున్నాయట.

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

ఐతే ఇది కథకాదని నిజమని రుజువుచేసే విధంగా విలువైన రత్నాలు, నాణెలు, బంగారు ఉత్సవ ఉంగరాలు, కాంస్య గంటలు.. వంటి అరుదైన సంపదతో నిండిన ద్వీపాన్ని నిధిరూపంలో మత్స్యకారులు కనుగొన్నారు. అంతేకాకుండా 8వ శతాబ్దానికి చెందిన రత్నాలతో అలంకరించబడిన బుద్ధుని విగ్రహం కూడా ఈ నిధిలో బయటపడింది. దీని విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత విలువైన నిధుల్లో ఇది ఒకటని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

శ్రీవిజయ నాగరికతకు చెందినవే..
‘ది గార్డియన్‌’ అనే బ్రిటీష్‌ డైలీ న్యూస్‌ పేపర్‌ నివేదిక ప్రకారం ఈ గుప్త నిధి శ్రీవిజయ నాగరికతకు సంబంధించింది. క్రీ.శ. 7 నుంచి 13వ శతాబ్ధం వరకు శ్రీ విజయ సాంమ్రాజ్యం ఎంతో వైభవంతో విలసిల్లింది. ఐతే కేవలం ఒక శతాబ్ధకాలంలో ఈ సామ్రాజ్యం హఠాత్తుగా కనుమరుగైపోయింది. కారణాలు ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియరాలేదు. మనదేశంతో కూడా ఈ సాంమ్రాజ్యానికి చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొంది.

చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’

శ్రీవిజయ సామ్రాజ్యం కల్పితం కాదు..ఆధారాలివిగో..
బ్రిటీష్‌ మరైన్‌ ఆర్కియాలజిస్టు డా. సీన్‌ కింగ్‌స్లే ప్రకారం.. ఈ సామ్రాజ్యం ఒకప్పుడు 'వాటర్ వరల్డ్' గా ప్రసిద్ధిగాంచింది. కేవలం చెక్కపడవలపై ఇళ్ళు, రాజభవనాలు, దేవాలయాలు నిర్మించారట. ఈ నాగరికత అంతరించినప్పుడు ఈ నిర్మాణాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయట. ఇప్పటికీ అక్కడి ప్రజలు చెక్క పడవలు తయారు చేసి వాడుతున్నారు. శ్రీ విజయ సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి.

ఈ నాగరికత ఆవిష్కరణ గురించి తెలుసుకోవడానికి థాయ్‌లాండ్ నుండి భారతదేశం వరకు వివిధ బృందాలు ప్రయత్నించాయి. కానీ ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఐతే గత ఐదేళ్లలో అసాధారణ విషయాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని కాలాలకు చెందిన నాణేలు, బంగారం, బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీవిజయరాజ్యం కల్పితం కాదనడానికి ఆధారాలు ఇవే.

చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

వీటితోపాటు ఆనాటి పాత్రలు,టేబుల్‌వేర్ వస్తువులు భారతదేశం, పర్షియా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి కాలంలో కాంస్య, బంగారు బౌద్ధ ఆలయాలు ఉండేవి. 20 వేల సైనికులు, వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు, 800 వడ్డీ వ్యాపారులు ఈ సాంమ్రాజ్య రాజధానిలో ఉండేవారట. దీనిని బట్టి జనాభా కూడా అధికంగానే ఉండి ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు రాహువు శిరస్సు విగ్రహం కూడా దొరికింది. భారతీయ హిందు ధర్మానికి సంబంధించిన అనేక ఇతర కళాఖండాలు కూడా బయటపడ్డట్టు కింగ్‌స్లే పేర్కొన్నారు.

అది ఇప్పటికీ రహస్యమే..
శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది అనేదానికి ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇండోనేషియా అగ్నిపర్వతాలవల్ల గానీ లేదా వరద కారణంగా గానీ ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement