భూమి పైకొస్తోంది!
లండన్: అంటార్కిటికాలో మంచు అడుగున ఉన్న భూమి పైకి తన్నుకొస్తోంది.. అదీ 400 కిలోమీటర్ల లోతు నుంచి.. ఏడాదికి 15 మిల్లీమీటర్ల వేగంతో పైకి వస్తోంది.. అదికూడా మొత్తం అంటార్కిటికా ఖండం కాకుండా.. అక్కడక్కడా పైకి లేస్తూ ఉపరితలం రూపును మార్చేస్తోంది.. బ్రిటన్‌కు చెందిన న్యూకాజిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో దీనిని గుర్తించారు. ‘‘అంటార్కిటికా ఖండంపై కొన్ని కిలోమీటర్ల మందంతో కప్పి ఉన్న మంచు కారణంగా అక్కడి భూమి పైపొర లోనికి కుంగిపోయి ఉంది. భూమి వేడెక్కడం కారణంగా మంచు కరిగిపోతుండడంతో... ఒత్తిడి తగ్గి పైకి లేస్తోంది. అయితే భూమిపై మిగతా ప్రాంతాల్లోకన్నా.. అంటార్కిటికా ఖండం కింద భూమి పొర సాంద్రత తక్కువగా ఉండడం వల్ల ఇది మరింత వేగంగా జరుగుతోంది.’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రేస్ నీల్డ్ చెప్పారు.