బెస్ట్ ఫొటోస్ ఆఫ్ ది ఇయర్
ఆమ్స్టర్డామ్: ఏటా నిర్వహించే వరల్డ్ ప్రెస్ ఫొటో కాంటెస్ట్ ఫలితాలు నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ లో గురువారం అర్థరాత్రి విడుదలచేశారు నిర్వాహకులు. ప్రపంచ నలుమూలలా చోటుచేసుకున్న వివిధ సందర్భాల్లో 5,775 మంది ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించిన 82,951 ఫొటోలు పోటీకి అర్హత సాధించాయి.
వాటన్నింటిలోకి సిరియన్ల వలస కష్టాలపై చిత్రించిన ఛాయాచిత్రానికి 2015 ఏడాదికిగానూ మొదటి బహుమతి దక్కింది. హంగరీ- సెర్బియా సరిహద్దు వద్ద చంటిపిల్లాడితో కంచె దాటుతున్న కుటుంబం ఫొటోను ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ రిచర్డ్ సన్ తీశారు. మొత్తం128 విభాగాల్లో ఉత్తమ ఫొటోలను ఎంపికచేశారు. వాటిలో కొన్ని ఇవి.. మరిన్ని చిత్రాల కోసం..